BMW cars | Luxury | Comfort | Remote | BMW7series

Bmw 7 is the most hitech car ever

BMW, BMW cars, Luxury, Comfort, Remote, BMW-7series

BMW-7 is the most hitech car ever. The new BMW-7 series car having excellent fatures. The car having massaging, reclining seats, a tablet, TV screens, automatic air-con and other comforts

ITEMVIDEOS: కారంటే కారు కాదు.. లక్సరీకి చిరునామా బిఎంబ్లూ-7

Posted: 06/12/2015 10:36 AM IST
Bmw 7 is the most hitech car ever

లక్సరీని ఎక్స్ ప్రెస్ చేసే వాటిలో కార్లు కూడా ఉంటాయి. ఎంత రాయల్ లా ఉంటే అంత లక్సరి ఉన్న కార్లను వాడుతుంటారు. అయితే జేమ్స్ బాండ్ సినిమాల్లో కార్లు ఎంతో అడ్వాన్స్ ఫీచర్స్ తో పాటు అదిరిపోయేలా ఉంటాయి. తాజాగా జేమ్స్ బాండ్ సినిమా కన్నా అదిరిపోయే ఓ కార్ ను లాంఛ్ చేసింది బిఎండబ్లు సంస్థ. తాజాగా లాంఛ్ చేసిన బిఎండబ్లు-7 సిరీస్ అదిరిపోయింది. కళ్లు చెదిరే స్టైలిష్ లుక్ తో పాటు అదిరిపోయే ఫీచర్లు ఈ కొత్త బిఎండబ్లు-7 సిరీస్ సొంతం. రిమోట్ తో కార్ ను పార్క్ చేసే ఫెసిలిటి ఉంది. జేమ్స్ బాండ్ సినిమాలో హీరో చేసినట్లు కారును రిమోట్ తో ఆపరేట్ చెయ్యవచ్చు.

కొత్త బిఎండబ్లు-7 సిరీస్ కార్ ను రిమోట్ సహాయంతో ఈజీగా పార్క్ చెయ్యవచ్చు. ఇక కార్ ఇంజన్ లేటెస్ట్ మోడల్ వి-8 ఇంజన్. ఇది 445 హార్స్ పవర్ కెపాసిటి కలిగి ఉంటుంది. ఇక కార్ బాడీ కార్బన్ ఫైబర్ తో మతిపోగొడుతోంది. ఇక రెగ్యులర్ డ్రైవింగ్ తో బోర్ కొట్టిన వారికోసం అడాప్టివ్ డ్రైవింగ్ మోడ్ ఉంది. కొత్తగా థ్రిల్ ఫీలవ్వడానికి ఈ మోడ్ చాలా బాగుంటుంది. ఇక సీట్స్ గురించి చెప్పాల్సి వస్తే లక్సరీకి మారు పేరుగా ఉంటాయి. విశాలమైన, మాసాజింగ్ సీట్స్ ఉండటంతో పాటు సీట్స్ ముందు టీవీ స్ర్కీన్లు కూడా ఉంటాయి. ఇక కార్లో ట్యాబెట్ సదుపాయం కూడా ఉంది.ధర కూడా చాలా అందుబాటులో ఉంది.

బిఎండబ్లు-7 సిరీస్ ఫీచర్స్..
* అదిరిపోయే లుక్
* మతిపోగొట్టే స్టైల్
* బాడీ కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు
* 445హార్స్ వపర్ కలిగిన న్యూ వి-8
* అడాప్లివ్ మోడ్ డ్రైవింగ్ ఫెసిలిటి
* రిమోట్ సహాయంతో పార్కింగ్ చెయ్యవచ్చు
* మసాజింగ్ సీట్స్
* ట్యాబెట్
* టీవీ స్ర్కీన్స్
* అటోమేటిక్ ఏసీ
* టచ్ స్ర్కీన్ తో కంట్రోల్ చెయ్యడం
* ధర 81వేల యుఎస్ డాలర్లు
* అదే ఇండియన్ కరెన్సీలో అయితే 51లక్షల 83 వేలు మాత్రమే

BMW7newcar07

BMW7newcar01

BMW7newcar02

BMW7newcar03

BMW7newcar04

BMW7newcar05

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BMW  BMW cars  Luxury  Comfort  Remote  BMW-7series  

Other Articles