Chandrababu, naralokesh, AP, CM, Telangana, TDP

Narachandrababu will make his son nara lokesh as ap cm soon

Chandrababu, naralokesh, AP, CM, Telangana, TDP

narachandrababu will make his son nara lokesh as ap cm soon. A gossip goes viral that in the note fo vote scandal chandrababu naidu plans to appoints his son as ap cm.

ఏపి సిఎంగా నారా లోకేష్.. !?

Posted: 06/08/2015 08:56 AM IST
Narachandrababu will make his son nara lokesh as ap cm soon

ఓటుకు నోటు వ్యవహారంలో స్వయంగా తానే మాట్లాడినట్లు నారా చంద్రబాబు నాయుడుకు సంబందించిన ఆడియో టేపులు విడుదలయ్యాయి. దాంతో ఏపి ప్రభుత్వంలో అలజడి మొదలైంది. నిన్నటి దాకా రేవంత్ రెడ్డి దాకా ఉన్న వ్యవహారం ఇక చంద్రబాబు నాయుడు దాకా రావడంతో ఏపి నేతల్లో కలవరం మొదలైంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకు ఒకటి రెండు రోజుల్లో నోటీసులు జారీ చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది అని నేతలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడుకు గనక నోటీసులు జారీ అయి.. విచారణ ఎదురుకోవలసి వస్తే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. అయితే అందుకే ఒకటే మార్గం అంటున్నారు సీనియర్ నేతలు.

రేవంత్ కేసులో చంద్ర బాబు నిందితుడుగా ఉండటం వలన ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని తన కుమారుడయిన లోకేష్ బాబు కు ముఖ్యమంత్రి బాద్యతలు అప్పగిస్తాడని పుకారు షికారు చేస్తోంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పదే పదే బాబే తనను పంపాడని ఆయన తరపునే తాను డబ్బు తీసుకుని వచ్చానని చెప్పడం వలన ఈ కేసులో చంద్రబాబు ను తెలంగాణా ప్రభుత్వం నిందితుడుగా చేరుస్తుందని అనుకున్నా.. తర్వాత నాటకీయ పరిణామాల మధ్య  చంద్రబాబు నాయుడు ఆడియో టేపులను విడదల చేసింది తెలంగాణ సర్కార్. దాంతో ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డ చంద్రబాబు..  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్తితి వస్తుందని TDP వర్గాల అనుకుంటున్నారు. ఒకవేళ అవే పరిస్థితులు గనక వస్తే ఇతర సీనియర్ నాయకులకు బదులు తన కుమారున్ని ముఖ్యమంత్రిని చేస్తే జయలలిత మాదిరి కేసు ఫై స్టే లాంటిది వస్తే మళ్లీ ఈజీగా CM కుర్చీ మీద కూర్చోవచ్చని బాబు ఆలోచనలట.  మొత్తానికి సంవత్సరం లోపే నవ్యాంద్రప్రదేశ్ కు రెండో ముఖ్యమంత్రి రాబోతున్నారంటూ వార్త.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  naralokesh  AP  CM  Telangana  TDP  

Other Articles