Chandrababunaidu, KCR, Telangana, AP, People

Telugu states chief ministers and telugu people also very busy in the discussion about the note for vote scanda

Chandrababunaidu, KCR, Telangana, AP, People

Telugu states Chief ministers and telugu people also very busy in the discussion about the note for vote scandal. KCR and Chandrababu naidu busy in the official programmees.

కేసీఆర్, చంద్రబాబులే కాదు వాళ్లూ కూడా బిజీ

Posted: 06/08/2015 08:42 AM IST
Telugu states chief ministers and telugu people also very busy in the discussion about the note for vote scanda

తెలుగు రాష్ట్రాల్లో వేడిరాజుకుంది. మొన్నటి దాకా ఎండలు మండిపోయినా.. గత రెండు రోజుల నుండి వాతావరణం మారింది. వాతావరణం కాస్త చల్లబడినట్లు అనిపించినా కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వేడిపుడుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో వేడి రగిల్చింది. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడినట్లు తాజాగా ఆడియో టేపులు విడుదలయ్యాయి. ఓ పక్క తెలంగాణ ముగింపు సంబరాలు జరుగుతుండగా.. ఛానళ్లలో చంద్రబాబు ఆడియో టేపులు దుమ్మురేపాయి. దాంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇదే విషయం మీద చర్చించుకుంటున్నారు. కొంత మంది ఆడియో టేపుల వ్యవహారం నిజమే అంటే.. మరికొందరు మాత్రం ఇదంతా డ్రామా అంటూ వాదించుకుంటూ బిజీబిజీగా ఉన్నారు.

ఇక అసలు వివాదానికి కారకుడిగా బావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మరోలా బిజీగా ఉన్నారుజ నల్గొండ జిల్లా పర్యటనలో కేసీఆర్ పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. జిల్లాలోని దామరచర్లలో ఏర్పాటు చేయనున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పైలాన్‌తో పాటు, చౌటుప్పల్‌లో వాటర్ గ్రిడ్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో .పాల్గొననున్నారు.ఇక ఏపి ముఖ్యమంత్రి విజయవాడలో ఏర్పాటు చేసిన సంకల్ప సభలో పాల్గొనడానికి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు ప్రజలు బిజీబిజీగా ఉన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababunaidu  KCR  Telangana  AP  People  

Other Articles