Telangana, abn andhrajyothy, KTR, Chandrababu, Twitter

Telagana minister ktr chalenge the narachandrababu naidu for lie detector test

Telangana, abn andhrajyothy, KTR, Chandrababu, Twitter

Telagana Minister KTR chalenge the Narachandrababu naidu for lie-detector test. KTR tweet the posts on chandrababu naidu and abn andhrajyothy channel.

చంద్రబాబుకు కేటీఆర్ ఛాలెంజ్

Posted: 06/08/2015 08:17 AM IST
Telagana minister ktr chalenge the narachandrababu naidu for lie detector test

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ కీలకనేత రేవంత్ రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే ఆదివారం రాత్రి నారా చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారంలో స్వయంగా మాట్లాడినట్లు ఆడియో టేపులు విడుదలయ్యాయి. దాంతో ఏపి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై ఎటాక్ కు సిద్దమైంది. అసలు ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు వాయిస్ కాదు అని పరకాల ప్రభాకర్ వెల్లడించారు. అయితే ఎబీఎన్ ఛానల్ లో కేటీఆర్ వైరా ఎమ్మెల్యేను టిఆర్ఎస్ పార్టీలొ చేరాలని మూడు కోట్ల రాయబారం నడిపారని ఓ కథనాన్ని వాయిస్ తో సహా ప్రసారం చేసింది. దాంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ పరోక్షంగా ఇరుకున పడ్డారు.

అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై, చంద్రబాబు వ్యవహారంపై తెలంగాణ ఐటి మంత్రి స్పందించారు. నారా చంద్రబాబు నాయుడుకు తన ట్విట్టర్ ద్వారా ఛాలెంజ్ విసిరారు. టివిలో లైవ్ లో లైడిటెక్టర్ టెస్టుకు తాను సిద్దమేనని.. మరి నారా చంద్రబాబు నాయుడు లైడిటెక్టర్ టెస్టులకు సిద్దమేనా అని సవాల్ విసిరారు. ఇది తెలంగాణ, ఏపి రాష్ట్రాల మధ్య గొడవ కాదు అని కేవలం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన మ్యాటర్ మాత్రమే అన్నారు. అయితే తన గురించే నాన్ సెన్సేషినల్ న్యూస్ ను ప్రజెంట్ చేస్తున్నారని అంటూ.. ఎబీన్ ఛానెల్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. ఎడీఎన్ చానల్ ను మొత్తానికి మూసివేయిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ktr-tweets-on-narachandraba

మరి దీని మీద నారా చంద్రబాబు నాయుడు, ఏపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  abn andhrajyothy  KTR  Chandrababu  Twitter  

Other Articles