Narachandrababu | Two eyes | Theory | telangana | ap

Narachandrababu naidu gave clarity on two eye theory

Narachandrababu, Two eyes, Theory, telangana, ap

Narachandrababu naidu gave clarity on two eye theory. He said that telangana and ap are his eyes and two states are important to him.

రెండు కళ్ల సిద్దాంతంపై చంద్రబాబు క్లారిటీ

Posted: 05/27/2015 01:41 PM IST
Narachandrababu naidu gave clarity on two eye theory

నారా చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్దాంతం గురించి తెలంగాణలో ఎంత రచ్చ జరిగిందో అందరికి తెలుసు. తెలంగాణకు అనుకూలంగా నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ మెమొరాండం ఇవ్వాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. అందులోనూ టిఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పై చేసిన విమర్శల గురించి సర్వత్రా చర్చసాగింది. చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్దాంతం పాటిస్తున్నారని ఏదో ఒక ప్రాంతానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడాలని వారు సూచించారు. అయితే అందరు అనుకుంటున్నట్లు అసలు రెండు కళ్ల సిద్దాంతం గురించి వాళ్లు వీళ్లు మాట్లాడుకోవడమే కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా మహానాడు సాక్షిగా మాత్రం క్లారిటీ ఇచ్చేశారు.

తెలంగాణ, ఏపి రాష్ట్రాలు తనకు సమానమని చంద్రబాబు వెల్లడించారు. తెలుగు విజయం వేదికకు ఒకవైపు కాకతీయ తోరణం, మరోవైపు అమరావతి స్థూపాన్ని ఏర్పాటు చేశారని ఇదే తన రెండు కళ్ల సిద్దంతం అని అన్నారు. తనకు రెండు ప్రాంతాలు ముఖ్యమేనని. తాను ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రెండు రాష్ట్రాల సమస్యలు ప్రస్తావిస్తానని అన్నారు. గతంలో తన రెండు కళ్ల సిద్దాంతంపై రకరకాల విమర్శలు వచ్చాయని అయినా తాను వాటిని పట్టించుకోలేదని వెల్లడించారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలే తన రెండు కళ్లు అని ఏ రాష్ట్రం తనకు ఎక్కువ కాదని.. తక్కువా కాదని వివరణ ఇచ్చారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababu  Two eyes  Theory  telangana  ap  

Other Articles