Narachandrababu | jagan | KCR | telangana | Congress

Nara chandrababu naidu fire on ys jagan and kcr

Narachandrababu, jagan, KCR, telangana, Congress

Nara chandrababu naidu fire on ys jagan and kcr. Narachandrababu tagetted TRS and YSR Congress party. On mahanadu stage he fire on them.

అటు జగన్ ఇటు కేసీఆర్ పై పరోక్షంగా చంద్రబాబు నిప్పులు

Posted: 05/27/2015 01:26 PM IST
Nara chandrababu naidu fire on ys jagan and kcr

నారా చంద్రబాబు నాయడు గండిపేటలో సాగుతున్న మహానాడులో ప్రతిపక్ష, పాలక పక్ష పార్టీల మీద నిప్పులు చెరిగారు. ఏపిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహారంపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎలాంటి అవినీతికి తావులేదని అంటూనే.. అవినీతికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టే పరిస్థితి లేదని అన్నారు. పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ పై ఐతే మరీ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తెలుగుజాతికి నష్టం కలిగిందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలొ రైతులు తీవ్రంగా నష్టపోయారని, కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు అన్నీ కాంట్రాక్టర్ లను ఉద్దరించడానికే అని మండిపడ్డారు. జగన్ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని అన్నారు.

కాంగ్రెస్ సప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి రాజ్యమేలిందని, తరువాతి ఐదేళ్లుపూర్తిగా అనిశ్చితి నెలకొందని చంద్రబాబు వివరించారు. పారిశ్రామిక వేత్తల నుండి కమీషన్ లు తీసుకున్నారని కానీ ఇప్పుడు మాత్రం జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చిందని అన్నారు. తెలంగాణ లో ప్రస్తుతం బడ్జెట్ మిగలులో ఉంది అంటే ఒక్క చంద్రబాబు వల్ల, ఒక్క  తెలుగుదేశం పార్టీ వల్లే అని అన్నారు. తెలంగాణలో వేల పరిశ్రమలను తీసుకువచ్చి, హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదే అని చంద్రబాబు వివరణ. చాలా మంది తెలుగు తమ్ముళ్లను తెలంగాణలో తమ పార్టీలోకి చేర్చుకున ప్రయత్నాలు చేసిందని కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం ప్రలోభాలకు లొగ్గలేదని తెలిపారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababu  jagan  KCR  telangana  Congress  

Other Articles