Arvind Kejriwal | 100days | Delhi

Arvind kejriwal call to cader to attent 100days celebrations meet in delhi today

Arvind Kejriwal, 100days, Delhi

arvind Kejriwal call to cader to attent 100days celebrations meet in delhi today. Kejiwal call in the twitter. He may fire on Leftenent Governor and central govt.

100 రోజుల కేజ్రీవాల్ ప్రభుత్వం.. కారాలు, మిరియాలు సిద్దం

Posted: 05/25/2015 11:09 AM IST
Arvind kejriwal call to cader to attent 100days celebrations meet in delhi today

ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీ సర్కార్ మొదలై 100 రోజులైంది.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో 100రోజుల ఉత్సవం సందర్భంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. నగర ప్రజలు సభకు రావాలని కేజ్రీవాల్ ట్విట్టర్ లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వంద రోజుల్లో ఆప్ సర్కార్ సాధించిన విజయాలను ఈ సందర్భంగా ఏకరవు పెడతారు. లిస్ట్ కూడా సిద్ధం చేశారు. విద్యుత్, నీటిసబ్సిడీ, అనధికార కాలనీల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు వంటి అంశాలను వివరిస్తారు. సీఎం, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇతర మంత్రులు ప్రజలతో ముఖాముఖీ మాట్లాడి.. సమస్యలను తెలుసుకోనున్నారు. పెద్దఎత్తున ప్రజలను రప్పించేందుకు మీటింగ్ పై ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు.. ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్రహోదాపై, ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పైనా ఆప్ కార్యదర్శి, ఢిల్లీ ముఖ్యమంత్రి సభా వేదిక మీద నుండి ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా అరవింద్ కేజ్రీవాల్ కు, లెఫ్టెనెంట్ గవర్నర్ కు మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం కూడా లెఫ్టెనెంట్ గవర్నర్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడటం కొత్త వివాదానికి తావిస్తోంది. ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘన విజయం సాధించి.. తర్వాత ఢిల్లీ  అధికారాన్ని చేపట్టి నేటికి వంద రోజులు కావడంతో కేజ్రీవాల్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు కేంద్ర ప్రభుత్వం, లెఫ్టనెంట్ పై విరుచుకుపడనున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  100days  Delhi  

Other Articles