telangana | police | recruirment | notification

Telangana govt ready to release the police recruitment

telangana, police, recruirment, notification

Telangana govt ready to release the police recruitment. Police department already sent the proposals to the finance department.

పోలీస్ ఉద్యోగ భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

Posted: 05/21/2015 09:58 AM IST
Telangana govt ready to release the police recruitment

కనిపించే నాలుగు సింహాలు నీతికి,న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్.. అన్న సాయి కుమార్ డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. మరి అలాంటి డేరింగ్ డ్యాషింగ్ జాబ్ ఒక్క పోలీస్ మాత్రమే. అందుకే యువతి పోలీస్ ఉద్యోగం కొసం చాలా తపన పడుతుంటారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రం భారీగా పోలీసుల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. రానున్న రెండు నెలల్లో నియామక ప్రకటన విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. నియామకాలకు సంబంధించిన నిబంధనలనూ మార్చనున్నారు. ముఖ్యంగా విమర్శలకు కారణమైన 5 కిలోమీటర్ల రన్నింగ రేస్ ను తీసివేస్తున్నట్లు సమాచారం. దాంతో పాటుగా మిగిలిన ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టుల్లోనూ కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నారు. దీనికి సంబందించి ఫైనల్ డెసిషన్ పెండింగ్ లో ఉంది.ఫిజికల్ టెస్టులకు ముందుగా రిటన్ టెస్ట్ నిర్వహించాలని సీనియర్ అధికారులు ప్రతిపాదించారు.  అది పూర్తికాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేష్ విడుల చేసే అవకాశం ఉంది.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2012లో ఎస్సై అభ్యర్థుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. అప్పటి నుండి పోలీసుశాఖలో ఉద్యోగాల భర్తీకి మళ్లీ ఎలాంటి ప్రకటనా రాలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పెద్దఎత్తున పోలీసుశాఖకు అదనపు పోస్టులు మంజూరు చేసింది. ముఖ్యంగా 3,150 డ్రైవర్ పోస్టులు మంజూరు చేసింది. దీంతోపాటు 2008 ప్రభుత్వం మంజూరు చేసిన 35వేల పోలీసు ఉద్యోగాలకు సంబంధించి చివరిదశ నియామకాలు జరగాల్సి ఉంది. ఇవి దాదాపు ఏడువేల వరకూ ఉన్నాయి. ఇవన్నీ డ్రైవర్, కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు. ప్రభుత్వం అనుమతి తీసుకున్న వెంటనే  జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.  

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  police  recruirment  notification  

Other Articles