telangana | kcr | land | osmania university | poor

Telangana cm kcr announed that houses to poor in the osmania universoty lands

telangana, kcr, land, osmania university, poor

Telangana cm kcr announed that houses to poor in the osmania universoty lands. Students of osmania university oppose the decision of the telangana cm kcr.

కేసీఆర్ ప్రకటన పుట్టిస్తోంది కాక

Posted: 05/21/2015 08:52 AM IST
Telangana cm kcr announed that houses to poor in the osmania universoty lands

ఇళ్లు లేని పేదవారికి ఉస్మానియా యూనివర్సిటీలో 11 ఎకరాల్లో ఇండ్లు కట్టించి తీరుతాం.. అదేమన్నా రాజదర్బారా? రాజ్‌ మహలా'' అని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన ప్రకటన ఆయనకే తలనొప్పిగా మారనుందా? పేదల పేరుతో విద్యా రంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయడం సమంజసమేనా? వెరసి ఆయన నిర్ణయం ఆయనకే సమస్యగా మారనుందా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే విన్పిస్తోంది. నిజానికి అక్కడ పేదలకు గృహ నిర్మాణం చేయాలనుకుంటే అందుకు అనుగుణంగా సంబంధిత విభాగాలకు సాధ్యాసాధ్యాల అంచనా గురించి లేఖలు రాయాలి. నివేదికలు తెప్పించుకోవాలి. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా ఆ రకమైన ప్రకటన చేయడం సరైంది కాదని అధ్యాపకులు ధ్వజమెత్తు తున్నారు. ఉస్మానియా వర్సిటీ భూములు ప్రభుత్వానివే! వాటిని నిజాం ప్రభుత్వం కట్టబెట్టినా.. అనంతరం ఉమ్మడి రాష్ట్ర  ప్రభుత్వ ఆధీనంలో ఉన్నా.. ప్రస్తుతం అవి తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నా.. అంతిమంగా 'ప్రభుత్వం' ఆధీనంలోనే ఉంటాయన్న మాట వాస్తవమే! విశ్వ విద్యాలయం స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. అయినా యూనివర్సిటీకి ఛాన్సలర్‌ (గవర్నర్‌) ఉన్నారు. ఆయన అనుమతి లేకుండా అంగుళం భూమినైనా రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది? గవర్నర్‌ అందుకు అంగీకరిస్తారా? వర్సిటీ భూముల గురించి ప్రకటించే హక్కు వర్తమాన పరిస్థితుల్లో ఒక్క గవర్నర్‌ (హోదా రీత్యా ఛాన్సలర్‌)కు తప్ప మరెవరికీ లేదన్నది అధ్యాపక సిబ్బంది వాదన.

ఓయూ భూములను ధారాదత్తం చేసుకోవడానికి యత్నిస్తూ విశ్వవిద్యాలయాలు ఏమైనా రాజదర్బార్లా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడమంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేయడమేనని వివిధ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. బుధవారం మూడో రోజూ ఓయూలో ర్యాలీ, దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు జరిగాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస, పీడీఎస్‌యూ, నవతెలంగాణ విద్యార్థి ఐకాస, టీఎన్ఎస్‌యూ, ఏబీవీపీ, నవతెలంగాణ విద్యార్థి సంఘం నేతలు వేర్వేరుగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలన్నారు. ఓయూ భూముల ధారాదత్తంపై వైఖరి ఇలాగే కొనసాగితే జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వర్సిటీకి బ్లాక్‌డేగా నిర్వహిస్తామని హెచ్చరించారు. జూన్‌లో వివిధ కోర్సుల్లో ప్రవేశ పరీక్షలను అడ్డుకుంటామని, తెలంగాణలో కేసీఆర్‌ను తిరగకుండా చేస్తామని చెప్పారు. తెరాస నేతలు ఈ ఏడాదిలో అక్రమంగా సంపాదించుకున్న వాటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  kcr  land  osmania university  poor  

Other Articles