Greater state-level contact key to improved India-China ties: PM Modi

24 agreements signed between india and china during pm modis visit

Indo-china relationship, narendra modi, Videos S jaishankar, foreign secretary, India, China, Gujarat, Maharashtra, Narendra Modi, Shanghai, New Delhi, Se Investments, Hyderabad, karnataka, indo china agreements

Prime Minister Narendra Modi on Friday said that the economic partnership between India and China would become a reality when the states and provinces of the two countries

చైనాతో భారత్ కుదుర్చుకున్న 24 ఒప్పందాలు..

Posted: 05/15/2015 03:52 PM IST
24 agreements signed between india and china during pm modis visit

భారత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటన రెండో రోజుకు చేరకుంది. క్రితం రోజు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సోంత పట్టణంలో బిజీగా గడిపిన మోడీ.. ఇవాళ ఇరు దేశాల మధ్య కోనసాగున్న దైపాక్షిక సంబంధాలపై కార్యరంగంలోకి దిగారు. ఈ క్రమంలో చైనా ప్రధాని లీ కెషాంగ్ తో ఆయన భేటీ అయ్యారు. భారత్ లో పెట్టుబడులపై ఇరువురు ప్రధానులు చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య 10 బిలియన్ డాలర్ల విలువైన 24 ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలను ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. అనంతరం చైనా ప్రధాని మాట్లాడుతూ భారత్, చైనాలు రెండూ ఆసియా ఖండానిక రెండు ఇంజన్లుగా పనిచేస్తాయని చెప్పారు.

ఇరు దేశాల మధ్య నెలకోన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుని అధునికత వైపు అడుగులు వేస్తామని.. రాబోయే రోజుల్లో ఆసియా అత్యున్నత శక్తిగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య నిరంతరాయంగా చర్చలు కొనసాగించాలని, నమ్మకాన్ని పెంపోందించుకోవాలని చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకుని ఎదగాలన్నారు. భారత్ చైనా దేశాల మధ్య సమస్యలు వున్నాయని, అయితే వాటన్నింటినీ పరిష్కరించుకని ముందగుడు వేస్తామని చైనా ప్రధాని తెలిపారు. అత్యంత కీలక సమస్య అయిన సరిహద్దు వ్యవహారంపై చర్చలు కోనసాగాలని అభిప్రాయపడ్డారు. సరిహద్దు వద్ద శాంతి నెలకోనే చర్యలను ఇరు దేశాలు చేపట్టాలని చెప్పారు.

అంతకుముందు ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ చైనాలో పర్యటన సంతోషంగా ఉందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయన్నారు. అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపామని, సరిహద్దుల్లో శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలను, రాష్ట్రాలతో పాటు ప్రజల మధ్యకు తీసుకు వెళతామని మోదీ తెలిపారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమైనదని, వాణిజ్య, పెట్టుబడులపై అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం అని అన్నారు. చైనాతో ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని మోదీ పేర్కొన్నారు. కాగా రేపు చైనాలోని ప్రముఖ సంస్థల సీఈవోలతో మోడీ భేటీ కానున్నారు. వీరితో పాటు చైనాలో వున్న భారతీయులను ఉద్దేశించి షాంఘైలో ఆయన ప్రసంగించనున్నారు.


భారత్- చైనా ద్వైపాక్షిక ఒప్పందాల వివరాలు:

1. చెన్నై, చెంగ్డూలలో రెండు రాయభార కార్యాలయాలు ఏర్పాటు
2. భారత్లో స్కిల్ డెవలప్ మెంట్ కోసం మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు పరస్పర సహకారం
3. వ్యాపార సంబంధాలను దౌత్యవిధానం ద్వారా నిర్వహించడం
4. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మధ్య సహాయ సహాకారాలు కొనసాగించడం
5. భారత్, చైనా రైల్వే సంస్థల మధ్య నిర్వహణ విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం
6. రెండు దేశాల మధ్య విద్యకు సంబంధించిన విధానాలను పరస్పరం అవలంభించడం
7. ఖనిజాలు, గనుల రంగాలలో పరస్పరం సహకరించుకోవడం
8. అంతరిక్ష సంబంధ విషయాలలో మైత్రి కొనసాగించడం
9. భారత్ దిగుమతి చేసుకుంటున్న రేప్ సీడ్ ఉత్పత్తులపై సురక్షిత మార్గదర్శకాలు
10. దూరదర్శన్, సీసీటీవీల మధ్య ప్రసార సంబంధమైన అంశంపై ఒప్పందం
11. ఇరు దేశాలు కలిసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం
12. రాజకీయ, మిలటరీ, ఆర్థిక సంబంధమైన అంశాల అభివృద్ధికి రెండు దేశాలు సంయుక్తంగా సంస్థలను నెలకొల్పడం
13. నీతి ఆయోగ్, డెవలప్ మెంట్ రీసెర్చ్ సెంటర్ మధ్య పరస్పర అవగాహన
14. భూకంప విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్ రంగాలలో పరస్పర సహకారం
15. వాతావరణ మార్పులు, సముద్ర విజ్ఞాన శాస్త్రం అంశాలపై అంగీకారం
16. భూ విజ్ఞాన శాస్త్రం రంగానికి సంబంధించి ఒప్పందం
17. రాష్ట్రాల ఏర్పాటు, ఆయా ప్రాంతాల నేతల నిమామకాలపై పరస్పర అవగాహన
18. భారత్, చైనా దేశాలలో ఉన్న రాష్ట్రాలు, పురపాలకాల అభివృద్ధికి సహాయ సహకారాలు
19. చైనాలోని సిచువాన్, భారత్ లోని కర్ణాటక రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలు
20. తమిళనాడులోని చెన్నై, చైనాలోని చోంగ్జింజ్ నగరాల మధ్య లావాదీవిలకు సంబంధించి అవగాహనా ఒప్పందం
21. హైదరాబాద్, చైనాలోని గింగ్డౌ నగరాల మధ్య స్నేహపూర్వక వర్తక, వ్యాపార  అంశంపై పరస్పర ఒప్పందం
22. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, చైనాలోని డున్హువాంగ్ నగరాల మధ్య వ్యాపార ఒప్పందం
23. ఐసీసీఆర్, ఫుడాన్ విశ్వవిద్యాలయాలం మధ్య సెంటర్ ఫర్ గాంధీయన్ స్టడీస్ ఏర్పాటుకు ఒప్పందం
24. భారతీయ యోగా విద్యను చైనాలోని కుమ్నింగ్ కాలేజీలో ప్రవేశపెట్టేందుకు ఇరుదేశాల మధ్య సమ్మతి

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM narendra modi  china trip  24 agreements  Li Keqiang  

Other Articles