Police probing Maneka 'assault' on UP forest staff

Gateman alleges assault by maneka gandhi

Maneka Gandhi, union minister maneka gandhi, forest department employee, Rooplal, Gajraula police in Bareilly, Pilibhit, Ashok Kumar Buddhapriye, physical and verbal assault byManeka Gandhi, sex determination tests, unparliamentary language,

An Uttar Pradesh forest department employee has accused Union minister Maneka Gandhi of physical and verbal assault during her visit to the state this weekend, police said.

కేంద్ర మంత్రి మేనక.. తద్దినక అనిపించారు.. గార్డు బిత్తరపోయారు..

Posted: 05/12/2015 02:52 PM IST
Gateman alleges assault by maneka gandhi

ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రజలు, ఉద్యోగులు, వారి హక్కులు గుర్తుండే నేతలకు అధికారంలోకి వస్తే మాత్రం అవన్నీ హరించుకుపోతాయి. తమ ప్రభుత్వమే అధికారంలో వుందన్న ధీమాతో ఏం చేసినా చెల్లిపోతుందన్నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి మేనకా గాంధీ వ్యవహారం కూడా అలానే వుంది. దేశ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కుటుంబానికి చెందిన కోడలుగా అమెకు దేశ ప్రజలలో ఎంతో సముచిత స్థానం వుంది. అయితే ఇన్నాళ్లు అమె తన స్థానాన్ని పథిలంగా కాపాడుకుంటే వచ్చారు. కానీ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు అమె చర్యలు కూడా సంచలనంగా మారుతున్నాయి.

కేంద్ర మంత్రి మేనకా గాంధీ తనను కొట్టారని ఓ ఫారెస్టు గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ను మీదుగా వెళ్తున్న మేనకా గాంధీ.. అడవిలో మంటలు వ్యాపించి పోగలు వస్తుండడాన్ని గమనించి స్థానిక గర్క చెక్ పోస్టు వద్ద వున్న ఫారెస్టు అధికారుల్ని నిలదీశారు. స్థానిక రైతులు గోధుమ పంటల్ని తగలబెట్టడం వల్లే మంటలు అడవులకు వ్యాపిస్తున్నాయని చెక్పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న 57 ఏళ్ల కాపలాదారు రూప్ లాల్..  మంత్రికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తాను మాట్లాడుతుండగా మధ్యలో కలిగించుకున్న కాపలాదారుపై మంత్రి అంతెత్తున ఎగిరిపడ్డారు. 'అసలు అడవులు తగలబడటానికి కారణం నువ్వే' అంటూ చెంపపై ఒక్కటిచ్చారు. ఊహించని పరిణామానికి రాంగోపాల్ వర్మ బిత్తరపోయాడు. ఆ సమయంలో ఫారెస్టు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నప్పటికీ కిమ్మనకుండా ఉండిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో మేనకాగాంధీ తనపై దౌర్జన్యం చేశారని బాధితుడు బైరేలిలోని గజ్ రౌల పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని  సీఐ అశోక్ కుమార్ బుద్దప్రియే తెలిపారు. కనీసం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారా అన్న ప్రశ్నకు స్పందించిన ఆయన.. అవన్నీ దర్యాప్తు తర్వాతే చేస్తామని.. ఎఫ్ఐఆర్ అర్థాన్ని కూడా మార్చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gateman  assault  Maneka Gandhi  union minister  

Other Articles