Court | Hussiansagar | Telangana

Court dismiss the petetion to stop revaccuation of hussain sagar

Court, Hussian sagar, Revaccuation, Telangana, KCR, national green tribunal

Court dismiss the petetion to stop revaccuation of hussain sagar. Telanagana govt decided to revacuated the hussain sagar.

హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు లైన్ క్లీయర్

Posted: 05/08/2015 08:07 AM IST
Court dismiss the petetion to stop revaccuation of hussain sagar

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదుద్దుతామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ను ప్రక్షాళించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసింది. అయితే ఇప్పుడన్న హుస్సేన్ సాగర్ లోని నీటిని ఖాళీ చేసి, పూడిక తీసి తర్వాత కొత్త నీటితో నింపాలని కేసీఆర్ ఆలోచన. అయితే అలా చేస్తే పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని చాలా మంది పర్యావరణవేత్తలు మండిపడ్డారు. కొంత మంది కోర్టుకు కూడా వెళ్లారు. అయితే హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనను నిలిపివేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. అశాస్త్రీయంగా జరుగుతున్న హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన వల్ల నగరవాసులకు పెను సమస్యలొచ్చే అవకాశాలున్నాయని, ప్రక్షాళనను నిలిపేయాలని నగరానికి చెందిన సోల్‌ (సేవ్‌ అవర్‌ అర్బన్‌ లేక్స్‌) స్వచ్ఛంద సంస్థ చెన్నైలోని ఎన్‌జిటిని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

హుస్సేన్‌సాగర్‌ నుంచి విడుదల చేస్తున్న వ్యర్థ జలాలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌జిటి ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులుగా సాగుతున్న హుస్సేన్‌సాగర్‌ నీటిని ఖాళీ చేసే పనులకు ఒక్కసారి బ్రేక్‌ పడ్డట్లయ్యింది. ఈ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్‌ఎంసి సంయుక్తంగా హైకోర్టులో  పిటిషన్‌ దాఖలు చేశాయి. న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డ్డిని రప్పించి హైకోర్టులో లంచ్‌ మోషన్‌లో పిటీషన్‌ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన హైకోర్టు చెన్నైలోని ఎన్‌జిటి ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణానికి సంబంధించి సుప్రీంకోర్టు సారథ్యంలో ఉన్న నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును హైకోర్టు ఎలా కొట్టివేస్తుందని, ఈ విషయంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పర్యావరణవేత్తలు అంటున్నారు. హుస్సేన్‌సాగర్‌ గర్భాన కొన్నేళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాలు ప్రమాదకరమైనవని, వాటిని అశాస్త్రీయంగా మూసీలో కలపడం వల్ల జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Court  Hussian sagar  Revaccuation  Telangana  KCR  national green tribunal  

Other Articles