Salman Khan hit-and-run case: If guilty, he faces 10 years in prison

Salman hit and run case verdict tomorrow

salman khan, hit and run case, hit and run, salman khan hit and run, hit n run, hit n run case, salman, salman khan cases, salman khan court, salman, actor salman khan, salman khan controversies, entertainment news

A sessions court is all set to deliver its verdict on Wednesday in the hit-and-run case involving Salman Khan.

రేపు తేలనున్న సల్మాన్ ఖాన్ భవితవ్యం..

Posted: 05/05/2015 03:06 PM IST
Salman hit and run case verdict tomorrow

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్.. భవితవ్యం ఏంటో రేపు తేలనుంది. తన సీనియర్ నటుడు సంజయ్ దత్ మార్గాన్నే అనుసరించనున్నారా..? లేక విదేశాలకు వెళ్లి సినిమా షూటింగ్ చేసుకుంటారా..? రేపు తేలిపోనుంది. 2002లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌ఖాన్‌పై కేసు విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. ముంబైలో సల్మాన్‌ఖాన్ ప్రయాణిస్తున్న కారు అర్థరాత్రి అదుపు తప్పిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందడంతో పాటు మరో నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును రేపు సెషన్స్ కోర్టు వెలువరించనుంది.

ఈ ఘటన జరిగిన తర్వాత పలు కోణాల్లో విచారణ జరుపగా ప్రమాదం జరిగినపుడు తాను కారులోనే ఉన్నా కానీ డ్రైవింగ్ చేయటం లేదని..ఆ సమయంలో తన డ్రైవర్ కారును నడుపుతున్నాడని సల్మాన్‌ఖాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. కారు డ్రైవర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. అయితే ఇప్పటికే విచారణ పూర్తైన ఈ కేసులో సల్మాన్ ఖాన్ సహా అతని డ్రైవర్ వాంగ్మూలన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశించడంతో.. ఇటీవలే వారు కోర్టుకు వాంగ్మూలాన్ని ఇచ్చారు. అయితే రేపు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కోర్టు ఎదుట బందోబస్తును కట్టుదిట్టం చేశారు. ఈ కేసులో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్తారా.. లేదా ఎప్పటిలాగే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంటారా అని అభిమానుల ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సల్మాన్ ఖాన్ ను న్యాయస్థానం దోషిగా నిర్థార్థించన పక్షంలో పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాం వుందని న్యాయనిపుణులు అంటున్నారు. రేపు కోర్టు ప్రాంగణంలోకి కేవలం మీడియా వారినే అనుమతించనున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salmankhan case final judgement  Hit and run case  Mumbai  Sessions court  

Other Articles