RTC employees to go on indefinite strike from May 6

Rtc unions talks fail strike to go on telangana

RTC Strike, AP Telangana, RTC Unions, Bus Bhavan, Indefinite Strike, RTC Employees, bus services bandh, bus strike, buses, ap, telangana, apsrtc

Telangana and Andhra Pradesh State RTC employees will begin an indefinite strike from May 6 as talks failed with management

నిలిచిపోనున్నా ప్రగతి చక్రం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం..

Posted: 05/05/2015 02:31 PM IST
Rtc unions talks fail strike to go on telangana

లక్షలాది మందిని అనునిత్యం వారి గమ్యస్థానాలకు చేర్చుతున్న ప్రగతి చక్రాలు నిలిచిపోనున్నాయి. యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. కార్మిక సంఘాలు డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించలేదు దీంతో ఇక సమ్మె బాట పట్టేందుకు కార్మిక సంఘాలు సిద్దమయ్యాయి. ఇవాళ రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు తేల్చిచెప్పారు. ఈ తరుణంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ను లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనంపై యాజమాన్యం నుంచి హామీ లభించలేదు. అయితే దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. డిమాండ్ల  పరిష్కారానికి సమయం కావాలని,  జులై వరకూ సమ్మె వాయిదా వేసుకోవాలని యాజమాన్యం ఈ సందర్భంగా కార్మిక సంఘాలను కోరింది. ఆర్టీసీ కార్మికులు కోరుతున్నట్టుగా 43 శాతం ఫిట్‌మెంట్ చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుండగా, ఆర్టీసీ యాజమాన్యం మాత్రం 28 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే 28 శాతం ఫిట్మెంట్కు అంగీకరించేది లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. దాంతో చర్చలు విఫలం అయ్యాయి.  దాంతో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు.... ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు సచివాలయానికి వెళ్లారు. కార్మిక సంఘాల చర్చలపై ఆయన ఈ సందర్భంగా సీఎంకు వివరించనున్నారు.  మరోవైపు మధ్యాహ్నం రవాణామంత్రి మహేందర్ రెడ్డితో కార్మిక సంఘాలు చర్చలు జరపనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bus services bandh  rtc strike  rtc  rct buses  

Other Articles