Congress | Youth | Votes

Congress party leaders plans to attract youth

Congress, Youth, Votes, Modi, Rahul gandhi, chit chat, rally

Congress party leaders plans to attract youth. Leaders want to recharge the congress by geting youth force into the party. congress party vice president rahul gandhi instruct the cader to fill the posts with younger people.

యూత్ ను బుట్టలో వేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు

Posted: 05/05/2015 01:35 PM IST
Congress party leaders plans to attract youth

సార్వత్రిక ఎన్నికల్లో అంతర్జాతీయ మీడియా భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల గురించి కవరేజ్ చేసింది. అయితే అందులఓ భాగంగా దేశంలో ఉన్న కీలక నేతల గురించి వారి చరిష్మా గురించి ఆరా తీసింది. అయితే బిజెపి పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలిచిన నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నుండి బహుశా ప్రధాని రేసులో ఉన్న రాహుల్ గాంధీ చరిష్మాను పోల్చి చూసింది. ఫలితాలు చూసిన మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రాహుల్ గాంధీ కంటే ఎంతో ముందున్నారు నరేంద్ర మోదీ. అయితే రాహుల్ గాంధీ యువకుడే కానీ యువ ఓటర్లు మాత్రం నరేంద్ర మోదీ వెంటే ఉండటం వారికి ఆశ్చార్యాన్ని కలిగించింది.

ఫలితాలతో కుదేలైన కాంగ్రెస్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది.  సాధారణ ఎన్నికల్లో యూత్ దూరమవడంతో దెబ్బతిన్నామని తెలుసుకున్న నేతలు.. ఇప్పుడు యూత్ ను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు రాహుల్ టూర్ ను ఉపయోగించుకునేందుకు స్కెచ్ వేస్తున్నారు. పార్టీలో ఇప్పుడు ఉన్నవాళ్లంతా సీనియర్లే. పదేళ్లనుంచి పార్టీ అధికారంలో ఉండటంతో అప్ డేట్ కాలేకపోయింది. దూరమైన వర్గాలు దగ్గరయ్యేందుకు తాజాగా వేసిన హై లెవల్ కమిటీ కూడా యువతకు దూరం కావటంతో పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని అభిప్రాయానికి వచ్చింది. యూత్ ను అట్రాక్ట్  చేయడమే లక్ష్యంగా  కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర పర్యటనకు రాహుల్ గాంధీ వస్తుండటంతో ఏదో ఒక యూనివర్సిటీ (బహుశా ఉస్మానియా యూనిర్సిటి) స్టూడెంట్స్ తో చిట్ చాట్  ఏర్పాటు చేస్తున్నారు. పాదయాత్రలో యువ రైతులే రాహుల్ వెంట నడిచేలా అరెంజ్ మెట్ చేస్తున్నారు.  సోషల్ మీడియాను యూజ్ చేసుకుంటామంటున్నారు నేతలు.పార్టీలో యువతకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. దీంతో సాంప్రదాయ ఓటు బ్యాంకు ను దగ్గరకు తీసుకుంటూనే యాత్ కు దగ్గర కావాలని కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నారు. మరి ఈ స్ట్రాటజీ ఎంత వరకు ఫలితాలనిస్తుందో.. వచ్చే ఎన్నికల్లో ఎంత వరకు ఫలితాలను రాబడుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  Youth  Votes  Modi  Rahul gandhi  chit chat  rally  

Other Articles