Ramdev: Putrajeevak Beej has nothing to do with child's gender

Ram dev baba explained about putra jeevak beej

Putrajeevak Beej has nothing to do with child's gender, Rajya Sabha, Ramdev's Divya Pharmacy, Rsmdev baba, K C Tyagi, Putrajeevak Beej, jaya bachan, opposition, kc tyagi, jp nadda,. Baba Ramdev, Yoga guru, Haryana brand ambassador, Opposition demand, social discrimination,social issues (general), Divya Putrajeevak Seed, Infertility, male child, Patanjali Yogpeeth

Yoga guru Baba Ramdev on Friday slammed his critics for claiming that 'Divya Putrajeevak Seed', sold by Divya Pharmacy, guarantees a male child.

'పుత్రజీవక్ బీజ్'తో మగబిడ్డ పుడతాడని నేను చెప్పానా..?

Posted: 05/01/2015 04:49 PM IST
Ram dev baba explained about putra jeevak beej

తనకు చెందిన దివ్యా ఫార్మసీ ఆయుర్వేద ఔషధంపై రాజ్యసభలో పెద్ద దుమారం రేగిన నేపత్యంలో దీనిపై యోగా గురువు, హర్యానా బ్రాండ్ అంబాసిడర్ బాబా రాందేవ్ స్పందించారు. పుత్రజీవక్ తింటే మగబిడ్డే పుడతాడని నేను ఎప్పుడు చెప్పలేదన్నారు. తాను ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా చెప్పానని రుజువు చేయాలన్నారు. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఆయన తన సంస్థకు చెందిన మగబిడ్డ మందుపై వివరణ ఇచ్చారు. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న పుత్రజీవక్ అనేది కేవలం వృక్షజాతి పేరు మాత్రమేనని, ఆ పేరుకు మగబిడ్డ పుట్టడానికి సంబంధమే లేదని అన్నారు.

తనపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకే కొందరు ఇలా చేస్తున్నారని, బురద జల్లే యత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుత్ర జీవక్ మందు తింటే మగ బిడ్డనే జన్మిస్తాడని తాము ఎక్కడా చెప్పలేదని అన్నారు. గురువారం జరిగిన రాజ్యసభ సమావేశంలో జనతాదల్ యునైటెడ్ (జేడీయు) ఎంపీ కేసీ త్యాగి పుత్రజీవక్ మెడిసిన్ నిషేధించాలని, దాని ఉత్పత్తి దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి.. ప్రజలను మభ్యపెట్టే మందులు, ఔషదాల పేర్లను, ఔషదాలు గుణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.  ప్రతిపక్షాలు కూడా ఆయనకు తోడవడంతో ఈ విషయం రాజ్యసభలో దుమారం రేపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : opposition  kc tyagi  jp nadda  ramdev  

Other Articles