producer bellamkonda suresh filmnagar office vandalised by localites

Producer bellamkonda suresh car rammed in to a youth

producer bellamkonda suresh car rammed in to a youth, Movies, producer bellamkonda suresh filmnagar office vandalised by localites, bellamkonda, producer bellamkonda suresh, car driver, tollywood, tollywood latest news, film nagar, car dasesh youth, driver on run, youth greviously injured

Senior producer Bellamkonda Suresh is in a serious trouble after his car hit a youngster at Road no 7 in Filmnagar, Hyderabad. The greviously injured

ITEMVIDEOS: నిర్మాత బెల్లంకొండ సురేష్.. ఫిలింనగర్ కార్యాలయం ధ్వంసం..

Posted: 04/24/2015 08:41 PM IST
Producer bellamkonda suresh car rammed in to a youth

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో స్థానికులు రెచ్చిపోయారు. ఫిలింనగర్ లోని వున్న నిర్మాత బెల్లంకోండ సురేష్ కార్యాలయంపై అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. కార్యాలయం అద్దాలతో పాటు లోపల వున్న ఫర్నీఛర్ ను కూడా ధ్వంసం చేశారు. తక్షఃణం నిర్మాత బెల్లంకోండ సురేష్ కార్యాలయానికి రావాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇంతకీ బెల్లంకోండ సురేష్ కు స్థానికులకు మధ్య ఏం జరిగింది. వారు అంతలా ఎందుకు రియాక్ట్ అయ్యారు. ఆయన కార్యాలయంపై ఎందుకు మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ రోడ్ నెంబర్ 7లో రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడిని ఆయన వాహనం వేగంగా వచ్చి ఢీకొనింది. అతడి పరిస్థితి విషమంగా ఉంది. దాంతో ఆ యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన స్థానికులు.. గాయపడ్డ యువకుడు స్థానిక కాలనీకి చెందిన వ్యక్తగా గుర్తించి బెల్లంకోండ సురేష్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కాగా, ఈ ఘటన జరిగిన వెంటనే కారు నడుపుతున్న డ్రైవర్ మాత్రం పరారైపోయినట్లు తెలిసింది. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో కారు డ్రైవర్పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, ఇప్పటికే ఆర్థికంగా పుట్టెడు కష్టాలలో వున్న బెల్లంకోండ సురేష్ పై మరో కష్టం వచ్చిపడింది. రెండు వారాల క్రితమే విడుదల కావాల్సిన గంగా చిత్రం.. రెండు వారాలవుతున్నా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇందుకు ఆయనకు వున్న ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. తన కోడుకు సినీ ఆరంగ్రేటం చేయించిన చిత్రం అల్లుడు శ్రీను భారీ నష్టాలను మూటగట్టుకోవడంతో.. బెల్లంకోండ ఆర్థికంగా చితికిపోయినట్లు సమాచారం.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bellamkonda suresh  car dasesh youth  driver on run  

Other Articles