rahu trekks to Kedarnath Shrine boost tourism

Rahul treks to kedarnath pays respect to flood

Rahul Gandhi treks to Kedarnath shrine, rahul pays tribute to flood victims, rahul gandhi trekks to Kedarnath Shrine boost tourism, rahul gandhi From parliament to pilgrimage, rahul gandhi uttarakhand tour, rahul gandhi on land acquisition bill, Congress vice president Rahul Gandhi, Rahul Gandhi trekking skills, rahul heads to Uttarakhand, rahul gandhi to visit Kedarnath shrine.

Rahul Gandhi completed a trek to the famous Kedarnath shrine in Uttarakhand today and told reporters that he walked the 16-km trail because he hopes his journey will help boost tourism in the state, which was ravaged by floods two years ago.

ఛారధామ్ వరద మృతులకు సంతాపం తెలిపిన రాహుల్

Posted: 04/24/2015 08:48 PM IST
Rahul treks to kedarnath pays respect to flood

కాంగ్రెస్ యువనేత, ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలనడకన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయానికి చేరుకున్నారు. రాహుల్ 16 కిలో మీటర్ల మేర నడిచి ఆలయానికి చేరుకున్నారు.. కేదార్నాథ్ ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2013లో అకాల వర్షాలు, వరదల వల్ల మరణించిన చార్ధామ్ యాత్రికుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించినట్టు రాహుల్ చెప్పారు. అంతకుమించి దేవుణ్ని ఏమీ కోరుకోలేదని చెప్పారు. 2013లో వరదల సమయంలో కేదార్నాథ్లో పర్యటించి విపత్తును కళ్లారా చూశానని రాహుల్ గుర్తుచేసుకున్నారు.

మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడానికే ఇక్కడికి వచ్చానని చెప్పారు. హెలికాప్టర్లో వస్తే వారిని అగౌరవపరిచినట్టు అవుతుందని, అందుకుని వారి ఇక్కడి వచ్చిన కాలిబాటలోనే తాను వచ్చానని రాహుల్ తెలిపారు. అంతేకాకుండా.. ప్రవిత్ర పుణ్యక్షేత్రానికి వరదలు సృష్టించిన బీభత్సం తరువాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో మళ్లీ పర్యాటకంగా చార్ ధామ్ ప్రసిద్ది చెందాలని ఆకాంక్షిస్తూ.. తాను పర్యటన చేపట్టానని చెప్పారు. కాగా 36 సంవత్సరాల క్రితం 1979లో రాహుల్ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా 40 కిలో మీటర్లు కాలినడకన వెళ్లి బద్రీనాథ్ను దర్శించుకున్నారని చెప్పారు.
 
జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Indira Gandhi  kedar nath  badrinath  

Other Articles