తెలంగాణలో అధికారిక పార్టీ టీఆర్ఎస్ తలపెట్టిన ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. వీఐపీలకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ నగరం ముస్తాబ్ అయింది. గ్రేటర్ యావత్తు గులాభివర్ణంగా మారింది. ఎండకు, వానకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎల్బీ స్టేడియం సిద్ధమైంది. టీఆర్ఎస్ అధికారం చేపట్టి ఏడాది కావస్తున్న తరుణంలో కనీవినీ ఎరుగని రీతిలో సంబరాలు చేసుకునేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. నగరంలోని ఎల్బీస్టేడియంలో 40 వేలమందితో ప్లీనరీ నిర్వహనకు ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వర్షం పడినా ఇబ్బంది లేకుండా స్టేడియం అంతా రేకులతో కప్పేశారు.
వేసవికాలం కావడంతో వేడి నుంచి ఉపశమనానికి 300 కూలర్లు ఏర్పాటు చేశారు. ఫ్యాన్లు, ఏసీలు అందుబాటులో ఉంచారు. ప్రతినిధుల కోసం మంచినీళ్లతోపాటు స్టేడియంలోకి వెళ్లే నాలుగు గేట్ల వద్ద మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల కూడళ్లును గులాబీ మయం చేశారు. నగరంలోని ముఖ్యమైన కూడళ్లలో సీఎం కేసీఆర్ కటౌట్లు ఏర్పాటు చేశారు. ప్రతినిధులకు వేదిక కనిపించడంలేదనే ఇబ్బందులు లేకుండా ఆరు బారీ ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
వేదిక ముందు వీఐపీలు, మహిళలు, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే 11 ప్రధాన రోడ్లకు మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్చార్జులుగా నియమించారు. 250 మంది కూర్చేనే విధంగా భారీ స్టేజ్ నిర్మించారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ప్లీనరీ రాత్రి 8 గంటల వరకు జరగనుంది. కేసీఆర్‌ను అధ్యక్షుడుగా మరో పర్యాయం ఎకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధికారికంగా ఈ ప్లీనరీ సమావేశంలో ప్రకటించనున్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more