Political | Drama | Weapon | AAP | Bjp

Political leaders useing every issue as its political weapon

politics, political, drama, farmer, bjp, aap, congress, parliament

Political leaders useing every issue as its political weapon. In aap rally, a farmer suicide political drama going on. BJP, AAP, Congress party leaders are behaving as such political leaders.

కాదేదీ రాజకీయాలకతీతం.. పక్కా పాలిటిక్స్

Posted: 04/24/2015 08:01 AM IST
Political leaders useing every issue as its political weapon

దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు కష్టం వచ్చింది. దేశ రాజధాని నడిబొడ్డున.. వేలాది మంది చూస్తుండగా..  అన్నదాత ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై  పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష పక్షాలు పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నాయి. చివరకు అతడి ఆత్మహత్యపై దర్యాప్తు చేసే అధికారం ఎవరికి ఉంది అనే అంశాన్నీ వివాదం చేశారు రాజకీయ నాయకులు. రైతు ఆత్మహత్యకు ఆమ్ ఆద్మీ పార్టీయే కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గురువారం ఢిల్లీ పోలీసు కార్యాలయం, కేజ్రీవాల్ నివాసం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

గజేంద్రసింగ్ ఆత్మహత్యకు ఢిల్లీలోని ఆప్ సర్కారు, కేంద్రంలోని బీజేపీ సర్కారు బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే.. ఆ పాపం ఆప్‌దేనని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రత్యారోపణ చేశారు. దిల్లీ సిఎం కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చెయ్యాలని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.  ఆత్మహత్య చేసుకునేలా అక్కడున్న వాళ్లంతా చప్పట్లు కొడుతూ రెచ్చగొట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ గత పాలన వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఎదురుదాడి చేశారు. ఆప్ స్పందిస్తూ.. రాజ్‌నాథ్ అబద్ధాలు చెప్తున్నారని, గజేంద్రను రక్షించటానికి పోలీసులు ప్రయత్నించలేదని, ప్రేక్షక పాత్ర పోషించారని ఢిల్లీ పోలీసులపై నిందమోపారు. ఆప్ నేతల వల్లే రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. రైతును కాపాడేందుకు తాము చేసిన ప్రయత్నాలకు ఆప్ నేతలు, కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారని.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మొత్తానికి రాజకీయానికి ఆత్మహత్యలు కూడా ఖచ్చితంగా ఆయుధాలు అవుతాయి అన్న వాస్తవాన్ని మరోసారి నిరూపించారు మన నేతలు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : politics  political  drama  farmer  bjp  aap  congress  parliament  

Other Articles