Congress | Rahulgandhi | Retunes | Twitter

Congress leaders celebrating rahul gandhi returns

Rahul gandhi, pc chako, congress, sonia gandhi, delhi, leaders, celebrations,rally, net nutrility

Congress leaders celebrating Rahul gandhi returns. The congress vice prsident Rahul gandhi arrived delhi at 11.15am today. The leaders are celebrating rahul arrival.

రాహుల్ రాకపై కార్యకర్తల్లో ఆనందం.. నెట్ లో రాహుల్ హల్ చల్

Posted: 04/16/2015 12:32 PM IST
Congress leaders celebrating rahul gandhi returns

అప్పుడెప్పుడో వెళ్లిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. గత కొంత కాలంగా కనిపించకుండా పోయిన రాహుల్ బాబు తిరిగి రావడంపై కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యలయం, సోనియాగాంధీ ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకుల సందడి నెలకొంది. రాహుల్ గాంధీ ధాయ్ ఏయిర్ వేస్ ద్వారా డిల్లీకి చేరుకున్నట్లు ది సండే గార్డియన్ అనే పత్రిక ప్రచురించింది. తన చిన్ననాటి స్నేహితుడు సమీర్ శర్మతో కలిసి రాహుల్ కొన్నాళ్లు గడిపినట్లు సమాచారం. అయితే రాహుల్ గాంధీ రాక పై మీడియాలో మోత మోగుతోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ అని తేడా లేకుండా అన్ని చోట్ల రాహుల్ గాంధీ గురించే చర్చ సాగుతోంది. ట్విట్టర్ లో అయితే రాహుల్ గురించి కామెంట్లే కామెంట్లు వస్తున్నాయి. రాహుల్ గాంధీ నెట్ న్యూట్రినిటి కోసం ర్యాలీలో పాల్గొనాలి అని ఇచ్చిన పిలుపుకు స్పందన బాగానే వస్తోంది. నెట్ లో ప్రస్తుతం ఎక్కువగా రాహుల్ గాంధీ గురించే సెర్చ్ చేస్తున్నారట.

rahultweet01

అయితే రాహుల్ గాంధీ తర్వాత పాల్గొంటున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 19 న రాహుల్ గాంధీ రైతుల ర్యాలీలో పాల్గొంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. రేపు కాంగ్రెస్ నాయకులతో కలిసి మీటింగ్ నిర్వహించనున్నారని కూడా పిసి చాకో స్పష్టం చేశారు. అయితే రాహుల్ గాంధీ కనిపించకుండా పోయిన విషయం అడిగితే మాత్రం అది ఆయన వ్యక్తిగత అంశం అని అన్నారు. ప్రతి ఒక్కరికి ప్రైవసీ హక్కు ఉంది అని పిసి చాకో అన్నారు. మొత్తానికి ఢిల్లీ చేరిన రాహుల్ గురించి సర్వత్రా చర్చ మాత్రం హాట్ హాట్ గా సాగుతోంది. మరి రేపటి నుండి రాహుల్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరో పక్క రాహుల్ గాంధీ తిరిగి రావడంతో కాంగ్రెస్ లో ఆనందం వెల్లివిరుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఏకంగా ఆనందంతో టపాసులు పేల్చారు. ఎన్నికల సమయంలో పార్టీ గెలిచినపుడు ఎంత సందడి ఉంటుందో అంతలా సందడి చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.ౌ

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  pc chako  congress  sonia gandhi  delhi  leaders  celebrations  rally  net nutrility  

Other Articles