Firing Inside Bathinda Jail, Inmate shot In Suspected Gang-War

Firing inside punjab jail inmate shot in suspected gang war

Firing Inside Punjab Jail, Inmate Shot in Suspected Gang-War, Firing Inside Bathinda Jail, Inmate shot In Suspected Gang-War Bathinda, Punjab, Central Jail in Punjab's Bathinda, firing in bathinda jail, gang war, Gurjit Singh Mahalkalan, criminal Gurjit Singh, Kulbir Singh Naruana, involved in the firing. Naruana photos in facebook, one inmate talking on a cellphone, social networking site.

Two inmates at the Central Jail in Punjab's Bathinda were injured in firing early this morning inside the prison complex in what is suspected to be a gang war. One of them, Gurjit Singh Mahalkalan, is a notorious criminal.

జైలులో కాల్పుల కలకలం.. తుపాకులు ఎలా వెళ్లాయ్..?

Posted: 04/16/2015 12:50 PM IST
Firing inside punjab jail inmate shot in suspected gang war

పంజాబ్ లోని భటిండా కేంద్రీయ కారాగారంలో తుపాకుల కాల్పుల కలకలం సృష్టించాయి. జైలులో కాల్పలు ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. జైలు ఆవరణలో ఖైదీల మధ్య గ్యాంగ్వార్గా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైలులోనే ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయికి చేరిన విబేధాలు.. కాల్పుల ఘటనకు దారితీసినట్లు సమాచారం. ఇవాళ ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో కరడుకట్టిన నేరస్తుడు గుర్జిత్ సింగ్ మహల్ కలాన్ సహా మరో ఖైదీ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పలు ఘటనతో ఉలిక్కి పడ్డ జైలు అధికారులు వెంటనే గుర్జిత్ సింగ్ సహా గాయాపడిని ఇద్దరిని చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే వుందని వైద్యులు స్పష్టం చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం అక్రమంగా ఆయుధాలు కలిగివున్న కేసులో అండర్ ట్రయిల్ ఖైదీ కుల్బీర్ సింగ్ నౌరానాకు ఈ కాల్పులతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. జైలు ఆవరణలో కట్టుదిట్టమైన భద్రత నెలకోనగా, భద్రతా సిబ్బందిని దాటుకోని జైలులోకి తుపాకులు ఎలా వచ్చాయన్న అంశంమై ఉన్నతాధికారులు విచారణకు అదేశించారు. గత నెలలో నౌరానా సెల్ఫోన్లో మాట్లాడుతూ  ఫోజులిచ్చిన ఫోటోలు ఫేస్బుక్ లో దర్శనమిచ్చాయి.   ఆ తరువాత వాటిని పోలీసులు వాటిని  తొలగించినట్టు సమాచారం.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles