Ssc | Results | Valuation | Telangana

Ssc exams valuation from today in telangana state

ssc, telangana, students, result, education, chiranjeevi, board,

ssc exams valuation from today in telangana state. The education department of telangana did all arrangements for the valuation. may ssc exam result will announce soon.

నేటి నుండి పది ప్రశ్నాపత్రాల వ్యాల్యువేషన్

Posted: 04/11/2015 08:08 AM IST
Ssc exams valuation from today in telangana state

తెలంగాణలో పదో తరగతి పరీక్షాపత్రాల స్పాట్ వ్యాల్యుయేషన్ నేటినుంచి ప్రారంభం అవుతోంది. దీని కోసం తెలంగాణ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం పదకొండు కేంద్రాల్లో సుమారు 15 వేల మంది ఉపాధ్యాయులు ఈ వ్యాల్యుయేషన్ లో పాల్గొంటారు. వచ్చే మే మొదటి వారం నాటికి వ్యాల్యుయేషన్ పూర్తి చేసి రెండోవారంలో ఫలితాలను వెల్లడించాలని భావిస్తున్నారు. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలు శనివారంతో ముగుస్తున్నాయి. వీరికి సంబంధించిన వ్యాల్యుయేషన్ ఇప్పటికే పూర్తి అయినందున ఈ నెల 15లోగా అన్ని జవాబు పత్రాలను విద్యార్థులకు చూపించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చిరంజీవులు పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో భాగంగా 23న అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇదిలావుండగా టెన్త్ వ్యాల్యుయేషన్ కు చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచాలని టీటీఎఫ్ డిమాండ్ చేసింది. అసిస్టెంట్ ఎగ్జామినర్‌కి ఇస్తున్న మొత్తాన్ని  6 నుంచి 15 కు, స్పెషల్ అసిస్టెంట్‌కు ఇస్తున్న మొత్తాన్ని 125 నుంచి 250కు, చీఫ్ ఎగ్జామినర్‌కు చెల్లిస్తున్న మొత్తాన్ని 240 నుంచి 350కు పెంచాలని టీటీఎఫ్ డిమాండ్ చేసింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ssc  telangana  students  result  education  chiranjeevi  board  

Other Articles