TRS | TDP | Insurance

Trs party providing accidental insurance to its members

trs, tdp, insurance, party, workers, leaders, members, life insurance, accidental insurance

trs party providing accidental insurance to its members. The tdp party already provided the 2lakh insurance to the party workers. trs also in the tdp path, for insurance to party members.

కార్యకర్తలకు బీమా సదుపాయం.. టిడిపిబాటలో టిఆర్ఎస్

Posted: 04/11/2015 08:59 AM IST
Trs party providing accidental insurance to its members

టీఆర్‌ఎస్‌ పార్టీలో సభ్యత్వం తీసుకున్న సభ్యులందరికీ ఇక మీదట 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం అందనున్నది. ఈ మేరకు ఈ-మైడ్‌ లైఫ్‌ అనే జాతీయ బీమా కంపెనీ ప్రతినిధులకు టీఆర్‌ఎస్‌ పార్టీ చీఫ్‌, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు 4కోట్ల 64లక్షల 21వేల 200రూపాయల చెక్కును అంద జేశారు. గత ఫిబ్రవరి 4న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదుకు ఏ పార్టీకి రాని స్పందన లభించింది. గతంలో టిడిపి అవలంబించిన జీవిత భీమాను ఇప్పుడు టిఆర్ఎస్ కూడా ఫాలోఅవుతోంది.

పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అన్ని వర్గాల ప్రజానీకం విశేషంగా ఆకర్షితులై నిర్దేశించిన సమ యానికి టీఆర్‌ఎస్‌ పార్టీలో సుమారుగా 50లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. వీరిలో 41 లక్షల 30 వేల మంది సభ్యులు తమ పూర్తి వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించారు. దీనితో వీరందరికి ప్రమాద బీమా పథకాన్ని వర్తింప చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీ. ఈ-మైడ్‌ లైఫ్‌ అనే జాతీయ బీమా కంపెనీతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. దీనికి గానూ 4కోట్ల 64 లక్షల 21 వేల 200 రూపాయల చెక్కును సదరు కంపెనీ ప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ అందజేశారు. 50లక్షల సభ్యులకు గానూ ప్రస్తుతానికి 41 లక్షల 30 వేల మందికే బీమా డబ్బులు చెల్లించారు. అయితే, మిగతా సభ్యుల వివరాలను త్వరగా సేకరించి వారికి కూడా ఈ ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపచేయాలని పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trs  tdp  insurance  party  workers  leaders  members  life insurance  accidental insurance  

Other Articles