Mallimasthan | Body | Argentina | India

Malli masthan babi dead body may reach to nellore by april 16

malli masthan, mountain, argentina, india, nellore, chennai, dead body

malli masthan babi dead body may reach to nellore by april 16. The argentina govt, Indian govt trying to malli masthan babu dead body to india. Last march 24 lost his address at argentina mountains.

ఏప్రిల్ 16 నాటికి స్వస్థలానికి మల్లి మస్తాన్ బాబు మృతదేహం

Posted: 04/11/2015 07:49 AM IST
Malli masthan babi dead body may reach to nellore by april 16

పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ తరలింపునకు అర్జెంటీనాకు చెందిన రెండు ప్రైవేటు నిపుణుల బృందాలను వినియోగించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడుకు వివరించారు. అర్జెంటీనా ప్రభుత్వం కూడా సహాయం చేస్తామంటూ హామీ ఇచ్చిందని వారు తెలిపారు. దౌత్య కార్యాలయాలు ఇప్పటికే నిపుణుల బృందాలకు నగదు అడ్వాన్సు చెల్లించాయి.

ఒక బృందం శుక్రవారం నుండి పర్వతాన్ని ఎక్కడం మొదలుపెట్టింది. అర్జెంటినాకు చెందిన హెమన్ అగస్టో నాయకత్వంలోని పది మంది సభ్యులతో కూడిన బృందం మస్తాన్ బాబు మృతదేహం తరలింపులో పాల్గొంటోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే ఆదివారం నాటికి మస్తాన్‌బాబు మృతదేహాన్ని ఆండిస్ పర్వతాల బేస్ క్యాంపుకు తీసుకురాగలరని భావిస్తున్నారు. అక్కడి నుండి నెల్లూరులోని మస్తాన్ బాబు స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు మరో మూడు రోజులు పట్టవచ్చునని తెలుస్తోంది. పర్వతారోహకుల అంచనా ప్రకారం ఏప్రిల్ 16 నాటికి మృతదేహాన్ని చెన్నై మీదుగా నెల్లూరులోని స్వస్థలానికి తరలించే అవకాశం ఉంది. 5900 మీటర్ల ఎత్తు నుండి మృతదేహాన్నిహెలీకాప్టర్ ద్వారా తరలించడం సాధ్యం కాదని భావించిన నిపుణుల బృందం మనుషుల ద్వారానే ఆ పనికి పూనుకుంది. మల్లి మస్తాన్ బాబు ఆచూకీ మార్చి 24 నుండి తెలియకుండా పోయిన సంగతి తెలిసిందే.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malli masthan  mountain  argentina  india  nellore  chennai  dead body  

Other Articles