Hillary Clinton Moving Toward 2016 Presidential Campaign

Hillary clinton to announce presidential bid as early as sunday

Hillary Clinton, former president bill clinton, US secretary to America, Presidential Bid, Presidential Campaign, hillary clinton to launch her presidential candidacy, New Hampshire, Hillary Clinton Moving Toward 2016 Presidential Campaign

Hillary Clinton is planning to launch her presidential candidacy on Sunday through a video message on social media, a person close to her campaign-in-waiting, followed immediately by traveling to early-voting states of Iowa and New Hampshire to start making her case to voters.

అప్పుడు పతి.. ఇప్పుడు సతి.. విపక్షాలకు ప్రధాన ప్రచార అస్త్రం..

Posted: 04/10/2015 09:37 PM IST
Hillary clinton to announce presidential bid as early as sunday

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి రేసులో హిల్లరీ క్లింటన్ పోటీ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాజీ ప్రధాని బిల్ క్లింటన్ సతీమణిగా, అధ్యక్షడు బరాక్ ఒబామా హయాంలో అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా అమెరికా వాసులతో పాటు యావత్ ప్రపంచానికి సుపరిచితురాలైన హిల్లరీ క్లింటన్ అధ్యక్ష రేసులో పోటీ చేయడానికి పార్టీ అభ్యర్థిత్వం కోసం మళ్లీ పోటీపడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ నుంచి అధ్యక్ష పదవి ప్రాథమిక రేసుకు అమె తన నామినేషన్ దాఖలు చేసే విసయమై త్వరలోనే ప్రకటన చేస్తారని మీడియా సమాచారం.

అధ్యక్ష ఎన్నికకు పోటీ చేయాలంటే అంతకంటే ముందుగా తమ డెమెక్రాటిక్ పార్టీలో జరిగే పోటీలో గెలవాల్సి వుంది. దీంతో ఆమె ఈ పోటీలో తన భవిష్యత్ ను తేల్చుకునేందుకు ఉత్సహాం చూపుతున్నారు. పార్టీ ఎన్నికలలో అత్యధిక ఓట్లు సాధిస్తేనే అద్యక్ష ఎన్నికలలో పోటీ చేయాల్సి వుంటుంది. లేని పక్షంలో మిన్నకుండాల్సి వుంటుంది. 2008లో జరిగిన ఈ ఎన్నికలలో అమె పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికలలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతిలో ఓటమిని చవిచూశారు.  దీంతో ఈ పర్యాయం మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుక అమె సన్నధం అయ్యారు.

తన రాజకీయ లక్ష్యాలపై వస్తున్న ఊహాగానాలను హిల్లరీ క్లింటన్ త్వరలో ముగిపంు చెబుతారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కోంది. అధ్యక్ష పదవికి తాను పోలీలో ఉన్నట్లు ఈ వారాంతంలో అధికారికంగా ప్రకటించవచ్చునని కూడా తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే అమె బ్రూక్లీన్ లో ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారని సమాచారం. అయితే మరో వైపు అమెకు పార్టీ ఎన్నికలలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి మద్దతు లభించినా.. విపక్ష రిపబ్లికన్లకు మాత్రం అమె మరో ప్రచారాస్త్రాన్ని అందించనున్నారు. అప్పుడు  పతి, ఇప్పుడు సతి.. అంటూ ప్రచారానికి తెరలేపేందుకు కూడా రిపబ్లికన్లు తెరలేపనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hillary Clinton  Presidential Bid  America  

Other Articles