Chandrababu | Letter | Wrote | Tamilnadu

Ap cm chandrababu naidu wrote a letter to tamilnadu cm

ap, cm, chandrababu, tamilnadu, letter, encounter, review, high court, police

ap cm chandrababu naidu wrote a letter to tamilnadu cm. chandrababu naidu wrote letter on encounter which place at sheshachalam forest last three days ago.

తమిళనాడు ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ

Posted: 04/10/2015 01:25 PM IST
Ap cm chandrababu naidu wrote a letter to tamilnadu cm

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ కౌంటర్ పై స్పందించారు. తమిళ కూలీలను అమానుషంగా మట్టుబెట్టారని, గత రెండు రోజులుగా సాగుతున్న తీవ్ర నిరసనల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. శేషాచలం అడవుల్లో మరణించిన 20 మంది కూలీల ఎన్ కౌంటర్ పై విచారణకు ఆదేశించామని లేఖలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విచారణ పూర్తై, నివేదిక రాగానే తమకు నివేదికను సమర్పిస్తామని చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రికి లేఖలో వెల్లడించారు. అయితే ఎన్ కౌంటర్ పై నిన్న సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు కోర్టులో ఎలా అప్రోచ్ కావాలో కూడా పోలీస్ అధికారులతో చర్చించారు.

ఎన్ కౌంటర్ పై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుపై నిరసనల పర్వం కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు ఒకవేళ చైన్నై వస్తే భౌతిక దాడులకు కూడా దిగుతామని హెచ్చరికలు వచ్చాయి. అదే విధంగా చంద్రబాబు నాయుడుకు సంబందించిన హెరిటేజ్ గ్రూప్ వ్యాపార సంస్థలపై కూడా దాడులు జరిగాయి. చంద్రబాబు నాయుడు మీదే కాదు తెలుగు ప్రజల మీదా దాడికి దిగుతామని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి కి లేఖ రాశారు. అయితే చంద్రబాబు లేఖ తమిళనాడు ఆగ్రహ జ్వాలలను ఎంత వరకు ఆపుతుందొ చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  cm  chandrababu  tamilnadu  letter  encounter  review  high court  police  

Other Articles