pavan kalyan to support farmers, if government pulls land from farmers

Pavan kalyan against land pulling in andhra pradesh

pavan kalyan against land pulling in andhra pradesh, pavan kalyan ultimatum to Andhrapradesh government, pavan kalyan to support farmers, land pulling in andhra pradesh, government utilizing land bill to acquire land, pavan kalyan support and fight in favour of farmers

pavan kalyan ultimatum to Andhrapradesh government, says if government utilizes land bill to acquire land, will support and fight in favour of farmers

ఆంద్రప్రదేశ్ సర్కారుకు.. పవన్ కల్యాన్ అల్టిమేటం..

Posted: 04/10/2015 12:09 PM IST
Pavan kalyan against land pulling in andhra pradesh

నవ్యాంధ్రలోని చంద్రబాబు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన శాయశక్తులా కృషి చేసిన జనసేన పార్టీ అదినేత, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇప్పుడు అదే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించి.. వారి భూములను ల్యాండ్ పుల్లింగ్ ద్వారా సేకరిస్తే సహించబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్టింగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో నూతన భూ సేకరణ ఆర్డినెన్సును వినియోగించి ప్రభుత్వం రైతుల భూములను సమీకరిస్తే.. సహించనని, రైతులు పక్షాన తాను నిలుస్తానని, అంతే కాదు.. అవసరమైతే రైతుల పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి కూడా తాను వెనకాడనని పేర్కొన్నారు.

ఇప్పటికే రాజధాని ప్రాంతంలో పర్యటించి.. అక్కడి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న పవన్ కల్యాన్.. ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా చర్యలు చేపడితే సహించబోనని చెప్పారు. అంతేకాదు.. రాజధాని కోసం సేకరిస్తున్న వేల ఎకరాల భూమిని ప్రభుఃత్వం ఒక్కసారిగా అభివృద్ది చేస్తుందా అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో రైతులకు పరిహారంపై కూడా ఆయన ప్రశ్నించారు. రైతు కూలీలకు సంక్రమించే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారని పవన్ కల్యాన్ ప్రశ్నించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pavan kalyan  land bill  AP government  farmers  

Other Articles