Vellur | vaigo | Tamil | AP | CM | Bojjala

Vaigo fire on ap cm chandrababu and bojjala the vellur police vaigo arrested at vellur

bojjala, vaigo, tamilnadu, ap, bojjala, vellure, police

vaigo fire on ap cm chandrababu and bojjala The vellur police vaigo arrested at vellur. The tamil party leader vaigo call to protest at chittur dist collectorate

వైగోను అరెస్ట్ చేసిన పోలీసులు.. చంద్రబాబు, బొజ్జలపై కారాలు మిరియాలు

Posted: 04/10/2015 01:03 PM IST
Vaigo fire on ap cm chandrababu and bojjala the vellur police vaigo arrested at vellur

చిత్తూర్ జిల్లా ఎన్ కౌంటర్ పై ఆగ్రహ జ్వాలలు ఎగిసినపడుతున్నాయి. చిత్తూర్ కలెక్టరేట్ ను ముట్టిడిస్తామని ప్రకటించిన వైగో ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళపార్టీ ఎండీఎంకే నేత వైగో తన అనుచరులతో వేలూరు కోట వద్ద ధర్నాకు దిగారు. తర్వాత తన మందిమార్బలంతో ర్యాలీగా చిత్తూర్ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరగా ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వైగోకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడి నుండి వెళ్లడానికి వీలులేదని పోలీసులు చెప్పడంతొ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. అయితే పరిస్థితి చేయి దాటకుండా వేలూరు పోలీసులు వైగోను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అయితే పోలీసులు అరెస్ట్ చెయ్యడంపై వైగో మండిపడ్డారు. ఏపి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయలు చెల్లించాలని వైగో డిమాండ్ చేశారు. ఏపి జైళ్లలో మగ్గుతున్న తమిళుల బాధ్యత తమిళనాడు ప్రభుత్వానిదే అని అన్నారు. అదే విధంగా తమిళనాడు కూలీల ఎన్ కౌంటర్ పై స్పందించిన ఏపి మంత్రి బొజ్జల ఏకంగా సినిమా డైలాగులు వల్లిస్తున్నారని విమర్శించారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్లో మానవత్వం లేదని కూడా అన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bojjala  vaigo  tamilnadu  ap  bojjala  vellure  police  

Other Articles