Encounter | Highcourt | Enquiry | Ramudu

Ap dgp support the encounter of red sandal smuglers in shashachalam

encounter, high court, dgp, ap, police, enquiry, hyderabad, ramudu,

Ap dgp support the encounter of red sandal smuglers in shashachalam.The high court of ap enquirys the encounter details. The court ajudge for afternoon.

ఎన్ కౌంటర్ పై హైకోర్టులో వాదనలు.. సమర్థించిన డిజిపి

Posted: 04/10/2015 12:31 PM IST
Ap dgp support the encounter of red sandal smuglers in shashachalam

ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే ప్రభుత్వం సమర్పించిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక మృతి చెందినవారికి వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్నిహైకోర్టు ఆదేశించింది. ఎన్కౌంటర్ కేసును ఎవరు దర్యాప్తు చేస్తున్నారని న్యాయస్థానం ఆరా తీసింది. పోలీసులే ఎన్కౌంటర్ చేసి...వాళ్లే దర్యాప్తు చేస్తే ఎలా అని ప్రశ్నించింది. అసహజ మరణం కింద కూలీలు మరణించారని కేసు ఎందుకు నమోదు చేయలేదని, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేశారా అని న్యాయస్థానం  ప్రశ్నించింది. అసహజ మరణం కింద కూలీలు మరణించారని కేసు ఎందుకు నమోదు చేయలేదని, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేశారా అని న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది.  ఈ కేసు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

ఎర్రచందనం కోసం అడవిలోకి వచ్చిన కూలీలు కరడుగట్టిన స్మగ్లర్లు అని ఏపి డిజిపి రాముడు హైకోర్టుకు వివరించారు. గతంలోనే స్మగ్లర్లకు హెచ్చరికలు జారీ చేశామనీ, కానీ వాటిని పట్టించుకోకుండా వారు అడవిలో యధేచ్ఛగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. స్మగ్లర్లను అడ్డుకునే క్రమంలో కూలీలు పోలీసులపై రాళ్లు రువ్వడమే కాకుండా గొడ్డళ్లతో దాడులకు దిగారని డిజిపి కోర్టుకు తెలిపారు. అడవిలొ ఏర్పాటు చేసిన కెమెరాల్లో వీడియో పుటేజ్ లు కూడా సాక్షంగా ఉన్నయని వెల్లడించారు. తప్పని సరి పరిస్థితిలో పోలీసులు స్మగ్లరలపై కాల్పులు జరిపారని డిజిపి హైకోర్టుకు నివేదించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : encounter  high court  dgp  ap  police  enquiry  hyderabad  ramudu  

Other Articles