Helmets | Video | YOutube | Gods

A video popular in youtube on the wearing helmets concept

helmets, video, The Indian Head and Injury Foundation, youtube, awareness, gods, wear

a video popular in youtube on the wearing helmets concept.The Indian Head and Injury Foundation released a video. The video show that the gods also wear the helmets and why dont we wear the helmets.

ITEMVIDEOS: దేవుళ్లే హెల్మెట్ పెట్టుకుంటున్నారు.. మరీ మీరు.. సూపర్ వీడియో

Posted: 04/08/2015 03:41 PM IST
A video popular in youtube on the wearing helmets concept

మ్యాటర్ పాతదే అయినా ప్రజెంటేషన్ కొత్తదైతే దాన్ని అందరు చూస్తారు.. అందులో కొందరైనా దాన్ని పాటిస్తారు. అయితే ఇప్పడు తాజాగా ఓ సామాజిక అంశాన్ని కొత్తగా చూపిస్తూ.. అందరిని ఆలోచింపచేజేలా చేప్తోంది. దేశంలో రోజురోజుకీ ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. వికలాంగులవుతున్నారు. జీవచ్ఛవాలుగా మిగులుతున్నారు. ఒకరు చేసిన తప్పుకి ఎంతోమంది బలైపోతున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, ప్రమాదాలకు గురై అయినవారికి తీరనిశోకాన్ని మిగిలిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే అని అందరికీ తెలిసిందే. కళ్ళ ముందు ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా, వాటిని పట్టించుకోకుండా వాహనాలపై తిరుగుతున్నాం. ఈ క్రమంలో రోడ్డు భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని ఓ స్వచ్చంద సంస్థ కొత్త తరహాలో చెబుతూ ఓ వీడియోను విడుదల చేసింది.

రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలన్న మెసేజ్ తొ ఇండియన్‌ హెడ్‌ ఇంజ్యూరీ ఫౌండేషన్‌ అనే సంస్థ ఓ వీడియోని రూపొందించింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా, వాహనం నడిపేటప్పుడు ‘హెల్మెట్‌’ తప్పనిసరిగా పెట్టుకోండి అన్న కాన్సెప్ట్‌తో ఈ వీడియోని తయారుచేసింది. ఇందులో మహావిష్ణువు, దుర్గామాత, వినాయకుడు తమ వాహనాలైన గరుత్మంతుడు, సింహం, ఎలుకలపై అధిరోహించి ప్రయాణం ప్రారంభిస్తారు. అయితే అప్పుడే ఒక్క నిమిషం పాటు ఆగి, తమ కిరీటాలు పెట్టుకుని తిరిగి ప్రయాణం కొనసాగిస్తారు. తలకి రక్షణ కవచం ఉంటే ఎలాంటి కీడు జరగదని భావించి, దేవుళ్ళే హెల్మెట్ ధరించి వాహనాలపై వెళుతుంటే, మనుషులైన మనం తలకి హెల్మెట్‌ ఎందుకు పెట్టుకోకూడదు.? అని ఆ కాన్సెప్ట్ సారాంశం.

దేవుళ్ళు మన రక్షకులు. అనుక్షణం మనల్ని కాపాడుతూ ఉంటారు. వారంతా సర్వశక్తివంతులు. అలాంటి దేవుళ్ళే రోడ్డు భద్రత పాటిస్తుంటే, మనమెందుకు పాటించకూడదు అని ఈ వీడియో ద్వారా  ఇండియన్‌ హెడ్‌ ఇంజ్యూరీ ఫౌండేషన్‌ ప్రశ్నించింది. ఇప్పుడా వీడియో నెట్టింట్లో దుమ్ము రేపడంతో పాటు అందరినీ ఆలోచింప చేస్తోంది. అయితే నెట్ లో బాగా హల్ చేస్తున్న వీడియోను లక్షల మంది వీక్షిస్తున్నారు. అయితే తమ కాన్సెప్ట్ అనుకున్న దాని కన్నా ఎక్కువ మందికి రీచ్ అయిందని ఇండియన్‌ హెడ్‌ ఇంజ్యూరీ ఫౌండేషన్ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. మొత్తానికి కాన్సెప్ట్ అదిరింది.. వీడియో ఇంకా అదిరింది. మరి వీడియో చూసిన తర్వాతైనా హెల్మెట్ వాడకం పెరుగుతుందేమో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : helmets  video  The Indian Head and Injury Foundation  youtube  awareness  gods  wear  

Other Articles