Lady | Gangrape | Hyderbad

A lady complaints that her boy fried and his friends raped

gang rape, hyderabad, dargiling, parlour, rape, police, medical, tests

a lady coplainted to hyderabad police that her boy friend and six his friends reped her. That lady running a beauty parlour at gandhi nagar, hyderabad. narayanguda police filed the case and sent the lady to medical tests.

హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ ..?

Posted: 04/06/2015 09:06 AM IST
A lady complaints that her boy fried and his friends raped

హైదరాబాద్ లొ మరోసారి కీచక పర్వం వెలుగు చూసింది. ప్రియుడు, అతడి స్నేహితులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి హైదరాబాద్ పోలీసులను అశ్రయించింది. బాధితురాలు ఈ ఘటనపై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని సమాచారం. డార్జిలింగ్కు చెందిన ఆమె గత కొంతకాలంగా హైదరాబాద్ గాంధీనగర్లో బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. తన బాయ్ఫ్రెండ్ ... స్నేహితులు ఆరుగురితో కలిసి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు యువతి తన ఫిర్యాదులో  పేర్కొంది.  

పోలీస్ స్టేషన్కు వచ్చిన సమయంలో ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు .ప్రియుడితో పాటు అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు. అయితే వారి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం జరిగిందా, లేక ప్రేమికుల మధ్య ఏదైనా గొడవ జరిగి యువతి అతనిపై ఫిర్యాదు చేసిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సివుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gang rape  hyderabad  dargiling  parlour  rape  police  medical  tests  

Other Articles