Ktr | Fire | Diggi | Congress

Telangana minister ktr fire on congress and senior leader digvijay singh

Ktr, Digvijay singh, Diggi raja, congress, Ktr, corruption, scams, scamgress

telangana minister ktr fire on congress and senior leader digvijay singh. Ktr fire on digvijay singh statements on watergrid programmee. ktr sentences contraversial statements.

మీదో పార్టీ.. మీదో బతుకు: కాంగ్రెస్ పై కెటిఆర్ నిప్పులు

Posted: 04/03/2015 01:44 PM IST
Telangana minister ktr fire on congress and senior leader digvijay singh

ప్రజల సొమ్మును దోచుకోవడానికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకానికి రూపకల్పన చేసినట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పందన వచ్చింది. తెలంగాణ మంత్రి కెటిఆర్ దిగ్విజయ్ వ్యాఖ్యలపై మాటల తూటాలు పేల్చారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి తమను విమర్శించే అధికారంలేదని తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. వాటర్ గ్రిడ్పై దిగ్విజయ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని కేటీఆర్ అన్నారు. దిగ్విజయ్ బాధ్యతారాహిత్యంగా పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. దేశంలో అవినీతికి మారుపేరు అయిన కాంగ్రెస్ స్కామ్ల పార్టీ... స్కాంగ్రెస్ అంటూ ఆయన ధ్వజమెత్తారు.

జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ పార్టీలాగా అవినీతికి పాల్పడలేదని తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ అన్నారు. పాతాళంలోని  తీసే బొగ్గు నుంచి ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ వరకూ దేశంలో ఏ రంగాన్ని కాంగ్రెస్ పార్టీ వదిలి పెట్టలేదని, అందినకాడికి దోచుకుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ చేసిన పనే...తామూ చేస్తామనుకోవడం సరికాదని కేటీఆర్ అన్నారు.
కుటుంబ పాలన గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదని... కాంగ్రెస్ నేతలు కుటుంబ పాలన గురించి మాట్లాడితే అది పెద్ద జోక్ అవుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీలా ప్రజాక్షేత్రం వదిలిపెట్టే ధోరణి తమది కాదన్నారు. మీదో పార్టీ...మీదో బతుకు..దరిద్రపు ఆలోచనలు...దౌర్భాగ్యపు మాటలు అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.  మొత్తానికి కెటిఆర్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ పార్టీనీ తూర్పారబట్టారు. మరి కెటిఆర్ కౌంటర్ కు కాంగ్రెస్ సమాధానం ఇస్తుందా చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ktr  Digvijay singh  Diggi raja  congress  Ktr  corruption  scams  scamgress  

Other Articles