Online | Registration | Ap

Online registration for propertys facility availabile in andhrapradesh

registration, online, ap, krishnamurthy, palle raghunathareddy, it, property, net, dd

online registration for propertys facility availabile in andhrapradesh. The Andhra Pradesh government formally put in place the "anywhere online registration" scheme that enables a property owner or buyer to complete most of the process, including payment of the fee, online. They need to go to the sub-registrar office only for the final act of registration.

ఆహా.. ఇక ఆన్ లైన్ లో ఆస్తుల రిజిస్ట్రేషన్

Posted: 04/03/2015 01:37 PM IST
Online registration for propertys facility availabile in andhrapradesh

ఎంతో కష్ట పడి డబ్బులు కూడా బెట్టి ఏదో ఒక ప్లాటో లేక పొలమో తీసుకోవాలని అనుకుంటాం. అయితే అవతల అమ్మే వ్యక్తి కూడా సిద్దంగా ఉంటారు. అయితే దాని ఖరీదు మాట్లాడుకునేపుడే రిజిస్టర్ ఆఫీసులో లంచాల గురించి కూడా మాట్లాడుతుంటారు. అది రిజిస్ట్రేషన్ సమయంలో జరిగే తంతు గురించి అద్దం పడుతుంది. అయితే అవినీతికి పరాకాష్టగా నిలిచే రిజిస్టర్ ఆఫీసుల్లో ఇక మీదట అలాంటి అవకాశం ఉండదు. ఇక మీదట జరిగే రిజిస్ట్రేషన్లు అన్నీ ఎంతో పారదర్శకంగా జరుగుతాయి. ఎందుకంటే ఇక మీదన ఆన్ లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందులోనూ ఎక్కడి నుంచైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వెయ్యడానికి కొత్తగా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకావాన్ని కల్పిస్తోంది. ఏపి మంత్రులు కె.ఇ. క్రిష్ణమూర్తి, పల్లె రఘునాథ రావు లు ఓ ప్రకటన చేశారు. అయితే గత ఫిబ్రవరి 21 నుండి రాజమండ్రి, విజయవాడ, కల్లూరు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టి మంచి ఫలితాలు రావడం జరిగింది. దాంతో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ను ఏపి మొత్తం అమలు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మీదట రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి ఆపీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లోనే చెల్లించాల్సిన డబ్బులను డిడి ద్వారా కట్టి, చివరి రోజు మాత్రం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళితే చాలు రిజిస్ట్రేషన్ తంతు పూర్తవుతుంది. మరి లంచాలకు భయపడి, రోజులకు రోజులు పడతాయని భయపడి రిజిస్ట్రేషన్ కు కాస్త దూరంగా ఉన్న వారికి ఇది మంచి వార్తే.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : registration  online  ap  krishnamurthy  palle raghunathareddy  it  property  net  dd  

Other Articles