Leslee Udwin | Fire | Giriraj

Leslee udwinwho is the director of daughter of india documentary fire on giriraj

giriraj, sonia gandhi, congress, Rapist, Leslee Udwin, Daughter of India Documentary,

Leslee Udwin who is the director of Daughter of India Documentary, fire on giriraj. Bjp mp giriraj contravesial comments on sonia gandhi. lesli fire on giriraj and she compare the mp with the rapist.

వాళ్లు రేపిస్ట్ కన్నా మంచోళ్లేం కాదు

Posted: 04/03/2015 01:56 PM IST
Leslee udwinwho is the director of daughter of india documentary fire on giriraj

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ పై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. సోనియాగాంధీ ఒక్కరినే కాకుండా రాహుల్ ను కూడా అతను విమర్శించడంతో కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. గిరిరాజ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అయితే సోనియా గాంధీ పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ ను ఏకంగా రేపిస్టులతో పోల్చి మరీ తిడుతున్నారు ఇండియన్ డాటర్ డాక్యుమెంటరీ దర్శకురాలు లెస్తీ ఉడ్విన్.

ప్రజా ప్రతినిధులై ఉండి స్త్రీలను అవమానించేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ రేపిస్టుకన్నా పెద్ద మంచివారేం కారని లెప్టీ ఉడ్విన్ అన్నారు.  అయినా ఎలాంటి ఆలోచన లేకుండా వ్యాఖ్యలు చేసే ఇలాంటివారిని భారత పార్లమెంటు కొన్నేళ్లుగా ఎందుకు అనుమతిస్తుందో అర్థం కావడం లేదని ఆమె మండిపడ్డారు.  వీరి మాటలకు జైలులో ఉన్న రేపిస్టు ముఖేశ్ సింగ్ మాటలకు తేడా ఏమైనా ఉందా' అని ఆమె నిలదీశారు.  ప్రధాని నరేంద్రమోదీ అలాంటి మంత్రిని సహించరాదని అన్నారు. గిరిరాజ్ సింగ్ను వెంటనే ఆ బాధ్యతలనుంచి తప్పించాలని సూచించారు. మొత్తానికి దేశం మొత్తాన్ని కుదిపేసిన ఇండియన్ డాటర్ డాక్యుమెంటరీ దర్శకురాలు ఇలా ఏకంగా నీతులు చెప్పడం ఏంటో అని కొందరు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అయితే తప్పు మాటలు మాట్లాడిని వారి గురించి నిజాలు మాట్లాడితే తప్పు లేదని మరి కొందరు వాదిస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : giriraj  sonia gandhi  congress  Rapist  Leslee Udwin  Daughter of India Documentary  

Other Articles