Saina Nehwal creates history, becomes World No. 1,

Saina nehwal creates history becomes first indian woman player to become world no 1

Saina Nehwal, first woman player, India Super Series, world number one, Carolin Marin, Spain, Ratchanok Inaton, Thailand, All England champion, Siri Fort Sports Complex, Yui Hashimoto, Prakash Padukone, Badminton News, sports news

India's ace shuttler Saina Nehwal on Saturday became the first woman badminton player from the country to be ranked number one in the world.

చరిత్ర తిరగరాసిన సైనా.. ప్రపంచ నెంబర్ వన్ షెట్లర్ గా నెహ్వాల్..

Posted: 03/28/2015 06:31 PM IST
Saina nehwal creates history becomes first indian woman player to become world no 1

భారతీయ బాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మరో అరుధైన ఘనతను సృష్టించింది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అమె రికార్డును సొంతం చేసుకుంది. ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భాగంగా తొలి సెమీస్ లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ ఓటమి పాలవ్వడంతో మరో సెమీస్ ఫలితంతో నిమిత్తం లేకుండానే సైనా ప్రపంచ నంబర్ వన్ అయింది.

తొలి సెమీస్లో థాయిలాండ్ స్టార్ మూడోసీడ్ ఇలనాన్ రచానోక్.. మారిన్కు షాక్ ఇచ్చి ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్ లో ఇలానాన్.. 21-19, 21-23, 22- 20 తేడాతో మారిన్ ను ఓడించింది.  మరో సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 1  ర్యాంకర్,  హైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. జపాన్ కు చెందిన యూ హషిమొటోతో అమీతుమీ తేల్చుకోనుంది. మరి కొద్ది గంటల్లో ఈ మ్యాచ్ మొదలుకానుంది. అయితే మ్యాచ్ ఫలితాన్ని పక్కనబెట్టినా.. సైనా ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారణిగా రికార్డును సొంతం చేసుకుంది. ఈ రికార్డును సాధించిన తొలి భారతీయ మహిళా షెట్లర్ గా కీర్తిని గడించింది. అంతకుముందు ప్రకాశ్ పదుకుణె ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు సాధించగా.. ఆ తరువాత సైనా నెహ్వాల్ ఒక్కరే తిరిగి ఈ రికార్డును సాధించడం ముదావహం.

ఇండియన్ ఓపెన్ టార్నమెంటులో సెమీఫైనల్స్ లో జపాన్ క్రీడాకారిణి యూ హషియోటోతో జరగనున్న మ్యాచ్ లో సైనాకు ఈ ర్యాంక్ వేయ్యి ఎనుగులు బలాన్ని ఇవ్వనుంది. కాగా, తాజా ర్యాకింగ్ తో ప్రత్యర్థులు కూడా కాసింతగా జంకే ప్రమాదముంది. ఈ సెమీ ఫైనల్ తో పాటు ఫైనల్ కూడా గెలిస్తే.. సైనా నెహ్వాల్ అదిపత్యానికి కొన్నాళ్ల వరకు అడ్డు వుండదు.

ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన హైదరాబాద్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ నిండా సైనా మానియా కనిపిస్తోంది. పలు వర్గాల ప్రజలు ఆమెను అభినందిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ట్విట్టర్ ద్వారా సైనాను అభినందించారు. ''ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన సైనా నెహ్వాల్కు అభినందనలు. ఆమెకు ఈ గౌరవం రావాల్సిందే. ఇండియన్ ఓపెన్ సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా శుభాకాంక్షలు'' అని రాష్ట్రపతి ప్రణబ్ తన ట్వీట్ ద్వారా చెప్పారు.

Congrats Saina Nehwal on becoming World no 1 in Badminton; well deserved honour; best wishes for Indian Open Semi Final #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) March 28, 2015

సైనా నెహ్వాల్ ప్రస్థానం కొనసాగిందిలా..

* 2006లో ఫిలిప్పిన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ను గెలిచి స్టార్ ఓపెన్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
* 2006లో బీడబ్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌లో రన్నరప్‌గా నిల్చింది.
* 2007 లో ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించింది
* 2007లో జాతీయ క్రీడలలో బ్యాడ్మింటన్ స్వర్ణాన్ని గెలుచుకుంది.
* 2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌ను సాధించి..తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.
* 2008లో చైనా మాస్టర్ సూపర్ సీరీస్‌లో సెమీస్ వరకూ సైనా వెళ్ల గల్గింది.
* 2008లో ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్ లో విజేతగా నిలిచింది
* 2008లో కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో స్వర్ణపతకం సాధించింది.
* 2008లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్ సాధించింది.
* 2009 లో ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్ సొంతం చేసుకంది.
* 2009 లో  ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లింది.
* 2010 లో ఆల్‌ ఇంగ్లండ్ సూపర్ సీరీస్ సెమీస్ వరకు వెళ్ళింది.
* 2010 లో ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది
* 2010 లో ఇండియా ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ గ్రాండ్‌ ప్రిక్ టైటిళ్లును సైనా కైవశం చేసుకుంది.
* 2011 ఆరంభంలో స్విస్ ఓపెన్ గెలిచింది.
* 2012లో సైనా స్విస్ ఓపెన్ టైటిల్ ను కాపాడుకోవడంలో సైనా సఫలమయ్యింది.  
* 2012లో ఇండోనేషియా సూపర్ సిరీస్ టైటిల్ ను, సమ్మర్ ఒలింపిక్స్ లో  కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది
* 2012లో డెన్మార్క్ సూపర్ సిరీస్ ను తొలిసారి కైవశం చేసుకుంది.
* 2014 లో మూడు టైటిళ్లను సైనా గెలుచుకుంది.
* 2014 లో ఇండియా ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకుంది.
* 2014 లో ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ సోంతం చేసుకుంది.
* 2014 లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ లను సైనా దక్కించుకుంది.
*2015 లో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టైటిల్ సైనాను వరించింది.
*2015 లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌ ఫైనల్ వరకు వెళ్లి తలపడింది

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  first Indian woman player  World No. 1 shuttler  

Other Articles