kona venkat, dvv danaiah looted dacoits at knife point

Threats to cine writer producer at knife point

threats to cine writer, threats to cine writer at knife point, threats to cine writer kona venkat, threats to cine producer, threats to cine producer at knife point, threats to cine producer Dvv danaih, producer, tollywood famous cine writer kona venkat, tollywood famous cine producer dvv danaiah,

tollywood famous cine writer kona venkat, producer dvv danaiah looted by dacoits at knife point on outer ring road

పీకలపై కత్తి పెడితే.. మంచి కథ దోరికిందని గంతేశారు

Posted: 03/28/2015 03:09 PM IST
Threats to cine writer producer at knife point

ఎవరి పీకలపైనైనా కత్తి పెట్టి బెదిరింపులకు పాల్పడితే. అదీ దారి దోపిడి ముఠా చేతిలో మారణాయుధాలతో ఇలా చేస్తే.. భయటపడగానే ప్రాణం దక్కింది అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా.. మంచి కథ దోరికిందని గంతులేశాడు ప్రముఖ సినిమా రచయిత కోన వెంకట్. అదేంటి సినీ రచయితను దారి దోపిడి ముఠా బెదిరించడమేమిటీ.. ఇది కూడా ఏదో సినిమా కథేగా అనుకుంటున్నారా..? కాదండి. ఇది యదార్థ ఘటన, స్వానుభవంతో వచ్చిన అలోచన. తమకు ఎదురైన విపత్కర పరిస్థితులను సినిమాగా తీయాలనే నిరీక్షణ. ఏమిటీ.. కోన వెంకట్ సహా దానయ్యలను దారి దోపిడీ ముఠా అడ్డుకోవడమేమిటి..? అది సినిమాగా తీయడమేమిటీ అని క్వశ్చన్ మార్క్ పెట్టకండి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి.

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న రచయిత కోన వెంకట్, నిర్మాత దానయ్యలు మహాబూబ్ నగర్ జిల్లా లోని షాద్ నగర్ లో గల ఆయన ఫాం హౌజ్ లో  జరిగిన వేడుకలకు హాజరయ్యారు. అర్థరాత్రి వరకు వేడుకలు జరగుగా, రాత్రి రెండు, రెండున్నర గంటల సమయంలో వారు అక్కడి నుంచి నగరానికి బయలు దేరి వస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వద్ద సరిగ్గా సినిమా ఫక్కిలో వాళ్లను దారి దోపిడి ముఠా అడ్డగించింది. రోడ్డుపై చెట్టును అడ్డంగా పడేసి తప్పించుకుని వెళ్లే వీలు లేకుండా అపింది. దీంతో చేసేది లేక దోపిడి ముఠాకు చిక్కిన వెంకట్, దానయ్యలను వారు నిలువు దోపిడి చేశారు. మెడపై కత్తి పెట్టి మరీ వంటి మీదనున్న బంగారు అభరణాలు. డబ్బు సహా ఇతర విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. చోరీ జరిగింది.  మొత్తం సుమారుగా మూడు లక్షల రూపాయల పైచిలుకు వారికి సమర్పించినట్లు సమాచారం.

అయితే వీరి వెనుకనే నగరానికి వస్తున్న శ్రీనువైట్ల, థమన్, గోపీ మోహన్.... దోపిడీ వ్యవహారాన్ని గమనించి తమ వాహనాలను వెనక్కి తిప్పి వెళ్లిపోయారు. వారు పోలీసులకు అందించిన సమాచారంతో హుటాహుటిన పోలీసులు ఘటనాస్థాలనికి చేరుకున్నారు. అయితే అప్పటికే దోపిడి ముఠా పలాయనం చిత్తగించింది. ఈ ఘటనపై కోన వెంకట్ మాట్లాడుతూ తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని, దుండగుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడినందుకు హ్యాపీగా ఉందన్నారు.  కాగా.. డబ్బు పోతే పోయింది కానీ, తన తదుపరి చిత్రానికి మంచి కథ దొరికిందని కోన వెంకట్ వ్యాఖ్యానించటం కొసమెరుపు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kona venkat  dvv danayya  srinu vaitla  robbery  prakash raj  

Other Articles