India's Fourth Navigational Satellite IRNSS-1D Launched From Sriharikota

India s fourth navigational satellite irnss 1d launched from sriharikota

Navigational Satellite IRNSS-1D Launched From Sriharikota, India's Fourth Navigational Satellite IRNSS-1D, IRNSS-1D, Sriharikota, PSLV-C27, satellite launched, Indian Regional Navigation Satellite System, IRNSS, ISRO

India today launched satellite IRNSS-1D from Sriharikota onboard workhorse PSLV-C27 which would pave the way for the country's own navigation system on par with the GPS of US.

నిప్పులు చిమ్ముకుంటూ.. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 27

Posted: 03/28/2015 07:39 PM IST
India s fourth navigational satellite irnss 1d launched from sriharikota

నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్).. తొలి ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.19 గంటలకు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ27 రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లి నిర్థేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. దేశీయ అవసరాల కోసం ప్రయోగించిన రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో షార్ లో శాస్త్రవేత్తలు ముఖాలలో ఆనందాలు విరబూసాయి. ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు తమ కరతాథ ధ్వనులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకున్నారు. రాకెట్ ప్రయోగానికి గురువారం ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ కు తెరపడింది.

నిజానికి ఈ రాకెట్ ప్రయోగాన్ని మార్చి 9న చేపట్టాల్సి వుండగా, చిన్నపాటి సాంకేతిక లోపం తలెత్తడంతో వాయిదా వేశారు. ఇవాళ సాయంత్రం దీనిని ప్రయోగించారు. ప్రయోగానికి ముందు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ పీఎస్‌ఎల్‌వీ-సీ27 రాకెట్‌ను పరిశీలించారు. శాస్త్రవేత్తలతో  సమీక్షల అనంతరం  1,425 కిలోల బరువున్న భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహం (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1డీ)ను అంతరిక్ష కక్ష్యలోకి  ప్రవేశపెట్టారు. దేశీయ అవసరాల నిమిత్తం భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థను సమకూర్చుకునేందుకు పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహ వ్యవస్థకు ఇస్రో శ్రీకారం చుట్టింది. మొత్తం ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించాలనే  వ్యూహంలో భాగంగా  ఇవాల్టిది నాలుగోది. ఉపగ్రహ ప్రయోగం విజయం సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇస్రో శాస్త్రవేత్తలకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
 
పీఎస్ఎల్వీ -సీ 27 ప్రత్యేకతలివీ..

* ఇస్రో చైర్మన్గా కిరణ్ కుమార్కు ఇదే తొలి ప్రయోగం.
* నావిగేషన్ శాటిలైట్ల శ్రేణిలో ఇది నాల్గోది.
* ఇదే ఏడాది మరో రెండు శాటిలైట్లను ప్రయోగించనున్నారు.
* మొత్తం 7 నావిగేషన్ ఉపగ్రహాలను 2016 లోగా ప్రయోగించునున్న ఇస్రో.
* దక్షిణాసియాలో మెరుగుపడనున్న ట్రాకింగ్, మ్యాపింగ్, నావిగేషన్.
* సముద్రంపై 20 మీటర్లు, భూమిపై 10 మీటర్ల పరిధిలో చూడగల అవకాశం.
* భారత భూభాగం నుంచి రెండువేల కిలోమీటర్ల వరకూ చూడగల నావిగేషన్ ఉపగ్రహాలు.
* మొత్తం ఐఆర్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు ఖరీదు రూ.1420 కోట్లు.
* ఒక్కో ఉపగ్రహం ఖరీదు రూ.125 కోట్లు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles