jagadeshwarreddy | statements | T. assembly

Telangana minister jagadeshwar reddy contraversial statements on dk aruna

jagadeshwar reddy, telangana, assembly, andhra, shoes, dk aruna, congress, chinnareddy, harishrao

telangana minister jagadeshwar reddy contraversial statements on dk aruna. congress senior mla chinnareddy oppose the statements of the minister. telangana assembly delayed for ten minuts while the discusion on jagadeshwar reddy statements.

మీలా ఆంధ్రా నేతల చెప్పులు నాకి ఎమ్మెల్యేని కాలేదు..!

Posted: 03/25/2015 12:02 PM IST
Telangana minister jagadeshwar reddy contraversial statements on dk aruna

తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణల మధ్య మాటల యుద్ధం జరిగింది.  మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ ప్రాజెక్ట్ అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.    తొలిసారి గెలిచి  ఎమ్మెల్యేగా సభకు వచ్చిన జగదీశ్ రెడ్డి చాలా నేర్చుకోవాలని  డికె అరుణ అన్నారు.  డికె అరుణ దాడిని తప్పికొడుతూ ఆంధ్రా నేతల చెప్పులు నాకి మీలా ఎమ్మెల్యేని కాలేదని, వైసీపీ బూట్లు నాకి మంత్రి పదవులు తెచ్చుకోలేదని, ప్రజల ఆశీర్వాదంతో గెలిచామని జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాంతో సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది.

జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోపం పనికిరాదు...ఓపిగ్గా మాట్లాడాలి అని జగదీశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సూచించారు.అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు జగదీశ్ రెడ్డి కూడా తాను కేసీఆర్ చలవ వల్ల, సూర్యాపేట ప్రజల ఆశీస్సులతో మంత్రినయ్యానన్నారు తన వ్యాఖ్యల్లో తప్పుంటే రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు. దాంతో సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ అసెంబ్లీని పదినిమిషాల పాటు వాయిదా వేశారు.
 
ఆ వ్యవహారంపై శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ సభను అడ్డుకోవడం సరికాదని, సభ సంప్రదాయాలను కాపాడాలన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని హరీష్‌ అన్నారు. సభలో జరిగిన సంఘటనను మంత్రి హరీశ్‌రావు కూడా చూశారని, బాధ్యత గల మంత్రి అలా మాట్లాడటం సరికాదని బిజెపి నేత లక్ష్మణ్ అన్నారు. దీనిపై మంత్రి హరీష్‌ మాట్లాడుతూ మొదట కాంగ్రెస్‌ పార్టీనే విమర్శలు మొదలు పెట్టిందన్నారు. మంత్రిని పట్టుకుని మొదటి సారి గెలిచావు...సమాధానం సరిగ్గా చెప్పాలి అని అన్నారని అందుకే జగదీష్‌రెడ్డి అలా సమాధానం చెప్పారని వివరణ ఇచ్చారు. తాను మాట్లాడిన మాటల్లో అభ్యంతరకర పదాలు ఉంటే రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి జగదీష్‌రెడ్డి కోరారు. దీంతో అసభ్యకర పదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్‌ తెలిపారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagadeshwar reddy  telangana  assembly  andhra  shoes  dk aruna  congress  chinnareddy  harishrao  

Other Articles