privilege motion against 9 ysrcp mlas, who had disrepected speaker chair

Privilege motion against ysrcp mlas

AP-Budget-2015, ap assembly, ysrcp, Privilege motionprivilege motion against ysrcp mlas, privilege motion against nine ysrcp mlas, Ap assembly, andhra pradesh assembly, AP assembly speaker kodela shiva prasad rao, 9 YSRcp mlas, TDP mla anitha, ysrcp mlas disrepected speaker chair, AP-Budget-2015, ap assembly, ysrcp, ap capital, Privilege motion,,

privilege motion against 9 ysrcp mlas, who had disrepected speaker chair

ఆ తొమ్మండుగురిపై త్వరలోనే వేటు..? రంగం సిద్దం

Posted: 03/25/2015 12:08 PM IST
Privilege motion against ysrcp mlas

ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి స్థానాన్ని అగౌరవ పరిచిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై వేటుకు సర్వం సిద్దమైంది. స్పీకర్ స్థానాన్ని అగౌరవపర్చిన 9 మంది వైసీపీ సభ్యుల అభ్యంతకర ప్రవర్తనపై టీడీపీ ఎమ్మెల్యే అనిత సభలో సభా హక్కుల నోటీసును ప్రవేశపెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అనిత స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌ స్థానానికి అగౌరవ పర్చారని నోటీసులు ఇచ్చారు. వైసీపీ సభ్యులు రోజా, చెవిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కొడాలి నాని, అనిల్‌కుమార్‌, శ్రీధర్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, ముత్యాలనాయుడును 6 నెలల పాటు సభ నుంచి సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

సభా హక్కుల నోటీసుపై మాట్లాడే అవకాశం కల్పించాలంటూ సభలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. అయితే సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై ప్రత్యేక హక్కుల సంఘం పరిశీలిస్తుందని, ఈ అంశంపై చర్చకు వచ్చినప్పుడు వైసీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తామని స్పీకర్‌ కోడెల తెలిపారు. అసెంబ్లీలో వున్న ప్రతిపక్షాన్ని తమ ఉచ్చులో బందించే చర్యలకు అధికార టీడీపీ అన్ని యత్నాలు చేస్తోంది. ఇందులో బాగంగా ఎప్పటికప్పుడూ తాజాగా వ్యూహాలు రచిస్తున్న అధికర పక్షంలో ఎదురుదాడిని మాత్రం వదలడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ తరపున గళం వినిపించిన తొమ్మండుగురు శాసనసభ్యులపై సస్సెన్షన్ వేటు వేసేందుకు సర్వం సిద్దమైనట్లు సమాచారం.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP-Budget-2015  ap assembly  ysrcp  Privilege motion  

Other Articles