Pm modi on landacquisiation bill on radio manki baat

modi, radio, man ki baat, land, pooling, opposition, 2013 bill

pm modi on landacquisiation bill on radio manki baat. pm narendramodi express his feeling on land aquisation bill. he said that the opposition party leaders are creating false information and wrong direction.

అన్నీ కట్టుకథలే.. ప్రతిపక్షాలపై మోదీ ఆగ్రహం

Posted: 03/23/2015 09:36 AM IST
Pm modi on landacquisiation bill on radio manki baat

భూమి సేకరణ బిల్లు రైతుల సంక్షేమానికి ఉద్దేశించినదేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నందుకు ప్రతిపక్షాలను ఆయన విమర్శించారు. రైతుల మంచి కోసం పోరాడుతున్నామనే వారు 120 ఏళ్లనాటి కాలం చెల్లిన చట్టం కోసం పట్టుపడుతున్నారని మోడీ అన్నారు. అయితే 2013 బిల్లులోనూ పలు లోపాలున్నాయని ఆయన తెలిపారు. 'మన్‌ కీ బాత్‌' ఆరవ ఎపిసోడ్‌లో ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు. ప్రతిపాదిత చట్ట్టంలోని వివిధ నిబంధనలపై మాట్లాడారు.  పీపీపీ క్లాజు ప్రజల మంచి కోసమేనని అన్నారు. రైతులు తమ పిల్లలు ఢిల్లి, ముంబై మురికివాడల్లోనే మగ్గాలని కోరుకుంటున్నారా అని మోడీ ప్రశ్నించారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ లు ప్రభుత్వయాజమాన్యంలోనే ఉంటాయని, అవి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తాయని పేర్కొన్నారు. సాగుభూమి సేకరణ గురించి మాట్లాడుతూ, అది వేరేమార్గం లేనపుడు చివరి ఆప్షన్ అని అన్నారు.  ముందుగా ప్రభుత్వ భూమి, తర్వాత బంజరు భూముల స్వాధీనానికే ప్రాధాన్యత ఇస్తారని ప్రధాని తెలిపారు.

భూసేకరణ చట్టం కింద జాతీయ రహదారులు, రైల్వేలు, గనుల కోసం భూమి కోల్పోయే వారికి నాలుగింతల నష్టపరిహారం వస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. 'కొత్త బిల్లు కింద పరిహారం తగ్గిస్తారనే అవాస్తవం వ్యాప్తి చెందుతోంది. ఏ పరిస్థితిలోనూ అటువంటి పాపానికి నేను ఏనాడూ పాల్పడనని హామీ ఇవ్వాలనుకుంటున్నా అని ఆయన అన్నారు.  రైతులు భూముల విషయంలో ముందుగా జిల్లా స్థాయిలో ఆశ్రయించేందుకు సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మోదీ వెల్లడించారు. అక్కడి పరిష్కారంతో రైతులు సంతృప్తి చెందకపోతే వారు కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. ఏదైనా ప్రాజెక్టు నిర్ణయించిన కాల పరిమితిలో పూర్తికాని పక్షంలో ఆ భూమి ఏమి చేయాలనేది రైతులే నిర్ణయించే అవకాశం ఉంటుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించబోమని మోదీ హామీ ఇచ్చారు. ప్రజలు తమ సమస్యలపై లేఖలు రాయాలని, తాను వారికి న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకోసుకుంటానని ప్రధాని ప్రజలకు హామీ ఇచ్చారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  radio  man ki baat  land  pooling  opposition  2013 bill  

Other Articles