Ttdp leader revanth reddy fire on telanagana cm kcr

reventh reddy, kcr, telanagana, gold, rold gold, govt, cm

ttdp leader revanth reddy fire on telanagana cm kcr. ttlp leader revanth reddy fir on telanagana cm k. chandrashekar rao for his statements. cm kcr every time says golden telanagana is govt aim, revanth reddy countre on that statements. revanth reddy said that as the cm kcr not even golden telanagana, even rold gold telanagana.

బంగారు కాదు రోల్డ్ గోల్డ్ తెలంగాణ కూడా రాదు

Posted: 03/23/2015 09:38 AM IST
Ttdp leader revanth reddy fire on telanagana cm kcr

తెలంగాణలో టిడిపి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అదిరిపొయే మాటలతో మీడియాకెక్కుతుంటారు. ఆయన ఎవరి మీద మాటల తూటాలు పేల్చినా, పెద్ద వివాదానికే దారి తీస్తుంది. తెలంగాణ అసెంబ్లీలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చుక్కలు చూపించడం ఖాయం అనుకునే, టిఆర్ఎస్ పార్టీ టిటిడిపి ఎమ్మెల్యేలపై వేటుకు సిద్దమైందని అనుకుంటున్నారు. అయితే టిఆర్ఎస్ నాయకుల్లో ముఖ్యంగా కెసిఆర్ పై ముందు నుండి మాటల తూటాలు పేలుస్తున్నారు రేవంత్ రెడ్డి. మోత్కుపల్లి, ఎర్రబెల్లి లాంటి సీనియర్ నాయకుల కన్నా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ గురించి భయపడుతుంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

తాజాగా మరో సారి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. గత కొంత కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ సాధనే తమ లక్ష్యంగా అంటూ భారీ ఎత్తున ప్రచారానికి దిగుతున్నారు. అయితే దీన్నే రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ కౌంటర్ వేసారు. సిఎం కెసిఆర్ తో  బంగారు తెలంగాణ కాదు కదా, రోల్డ్ గోల్డ్ తెలంగాణ కూడా రాదని వ్యంగ్యంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ ట్రెండ్ కు దగ్గరగా మాట్లాడుతూ, మీడియాను తన వైపుకు తిప్పుకుంటుంటారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఎలాంటి వివాదాలకు తావిస్తుందో చూడాలి. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reventh reddy  kcr  telanagana  gold  rold gold  govt  cm  

Other Articles