Trs and bjp partys confedence on mlc elections

mlc, elections, trs, bjp, council, poling, voting

in telangana telanagana rastra samithi party and bharatheya janatha party are cenfedence on mlc election which placed on sunday. bjp leaders are very happry on mlc poling and they are confidence on mlc winning. trs also confedence.

యాహూ.. గెలుపు మనదే

Posted: 03/23/2015 09:29 AM IST
Trs and bjp partys confedence on mlc elections

ఎమ్మెల్సీ ఎన్నికలపై టిఆర్ఎస్, బిజెపి పార్టీల్లో గెలుపు ధీమా కనిపిస్తోంది. మొదటి నుంచీ పక్కా ప్రణాళికతో ఉండడం, పెద్దఎత్తున ఓటర్లను నమోదు చేయించడంతో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల కంటే తమ పార్టీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారని, రెండు స్థానాల్లోనూ గెలుపు ఖాయమని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మాత్రం కాస్త నిరాశ ఆవహించింది. క్షేత్రస్థాయి ప్రతికూల పరిస్థితులతో రెండు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఎదురీదినా.. చివరికి గట్టెక్కవచ్చనే ఆశాభావాన్ని ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. దేవీప్రసాద్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎంపికతో ఆ పార్టీ నేతల్లో నైరాశ్యం నెలకొందని, ఇది ఫలితాల్లోనూ ప్రభావం చూపనుందని వివరిస్తున్నారు.

రెండు చోట్లా ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌ -బీజేపీ మధ్యనే నెలకొంది. హైదరాబాద్‌ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో పోలింగ్‌ జరగకపోవడంతో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్‌లో 27 శాతం, రంగారెడ్డిలో 37 శాతం, మహబూబ్‌నగర్‌లో 53 శాతం నమోదైంది. అయితే, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలపైనే టీఆర్‌ఎస్‌ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు జిల్లాల్లో పోలింగ్‌ శాతం తక్కువ నమోదు కావడమే కాకుండా, బీజేపీకి కాస్త అనుకూలంగా ఉండే మహబూబ్‌నగర్‌లో ఎక్కువ పోలింగ్‌ నమోదు కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పోలింగ్‌ రోజే ఒక్కో ఓటరుకు బీజేపీ నేతల నుంచి నాలుగైదు ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయి. పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. అయితే, టీఆర్‌ఎస్‌ ఎలాంటి ఎక్సర్ సైజ్ చెయ్యకపోవడంతో అది టిఆర్ఎస్ పార్టీ పై ప్రభావం చూపుతుందని అనుకుంటున్నారు. రామచంద్రరావు బార్‌ కౌన్సిల్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యుడు కావడంతో న్యాయవాదులు, జర్నలిస్టులతోపాటు ఉస్మానియా, పాలమూరు వర్సిటీల విద్యార్థులు, నిరుద్యోగులు రామచందర్‌ రావుపై మొగ్గు చూపారని అంటున్నారు. మొత్తానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అయితే ఫలితాల విడుదల కోసం అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఎదురు చూస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mlc  elections  trs  bjp  council  poling  voting  

Other Articles