Voters in festive mood poor responce for mlc elections

poor responce for mlc elections, poor responce for mlc elections on polling day, MLC election -2015, election polling, Telangana, andhra pradesh, less percentage voters turn out on polling day, mlc elections polling,

voters in festive mood, poor responce for mlc elections on polling, in telangana and andhra pradesh

తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు

Posted: 03/22/2015 11:47 AM IST
Voters in festive mood poor responce for mlc elections

రెండు తెలుగు రాష్ట్రాలలో ఉపాధ్యాయ, పట్టభద్రులఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కోనసాగుతున్నాయి. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కరువైంది. వరుస సెలవులు రావడం, దానికి తోడు ఉగాధి పర్వదిన పండగ వాతావరణం నుంచి ఓటర్లు బయటకు రాకపోవడంతో.. ఎన్నికలకు ఓటర్లు తక్కువ సంఖ్యలోనే హాజరవుతున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్, ఖమ్మం - నల్గొండ - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగ..  అలు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా - గుంటూరు , తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8.00 గం.లకు ప్రారంభమైన సాయంత్రం నాలుగు గంటల వరకు కోనసాగనుంది.

 హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానంలో 2,96,318 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1,37,261 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మూడు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 32 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వరంగల్ - ఖమ్మం- నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2,81,138 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLC election -2015  election polling  Telangana  andhra pradesh  

Other Articles