New ugadi sparks new lights in political leaders with great future

panchangam, politician, modi, chandrababu, sonia gandhi, jagan

new ugadi sparks new lights in political leaders with great future. in this uhadi the some political leaders future by panchangam

ఎవరి జాతకం ఎలా ఉందో తెలుసా..

Posted: 03/21/2015 02:25 PM IST
New ugadi sparks new lights in political leaders with great future

ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉన్నట్లుగానే రాజకీయ నేతల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు, ఇష్టాలు, సహకారాలు, కష్టాలు, సుఖాలు కలగలుపుగా ఉంటుంటాయి. అయితే ఈ మన్మథ నామ సంవత్సరంలో దేశ, రాష్ట్రాల్లో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న రాజకీయ నేతల భవితవ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం...

మోడీ:
ప్రజా సమస్యలకన్నా విదేశీ సమస్యలు, సమస్యా పరిష్కారం కన్నా ప్రచారం ప్రాధాన్యాన్ని పొందుతున్నాయన్న విమర్శలు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలలో ఆశించినంత ముందడుగు కనిపించదు. కార్యనిర్వహణలో కూడా చురుకుదనం కన్నా వాయిదాలు వేయడం...కొత్త సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడంలో సాధారణస్థితి గోచరిస్తుంది. ముఖ్యమైన ఎన్నికలు గతంలోలా లేనందువలన ఉత్తేజం తగ్గి కార్యక్రమాలలో స్తంభన కనబడుతుంది. ప్రతిపక్షాల విమర్శకు మేధావుల అండదండలతో, మీడియా మద్దతుతో సమస్యను తాత్కాలికంగా జయించగలుగుతారు. కొంతవరకూ అవనితికి దూరంగా పాలన సాగిస్తున్నారని పేరు తెచ్చుకుంటారు.

సోనియాగాంధీ:
ఆరోగ్యం, అధికారం సంతృప్తినిచ్చే స్థాయిలో లేకున్నా సమయాన్ని నెమ్మదిగా నడుపుతూ గతంలోని పనుల వలన వచ్చే చిక్కులను తప్పించుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీశ్రేణులను కాపాడమంటూ క్రిందివర్గీయులలో పరస్పర విమర్శలకు పూనుకుంటున్నా...కార్యక్రమాన్ని అమలుచేయలేక కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాహుల్‌గాంధీ విషయంలో ఆశించినంత పురోగతికి అవకాశాలు లేకపోయినా గంభీరంగా ఇతరుల విమర్శలను ఎదుర్కొంటారు. పాలకపక్షంవారు వీరిపై ఉదాశీన వైఖరిని, వీరు వారిపై ఉదాశీన వైఖరిని ప్రదర్శించి సమయోచితంగా సమస్యలను అధిగమిస్తారు.

చంద్రబాబు నాయుడు:
తన నైపుణ్యంతో పార్టీలోని వారిని, అధికారంలో ఉన్నవారిని నియంత్రించడం సాధ్యమవు తుంది. ఆర్థిక పరిస్థితులు ఇబ్బం దికరంగా సాగినా అధికారులను, ఇతర దేశీయులను ఆకట్టుకుని చేసే కార్యక్రమాలు ముందడుగు వేస్తాయి. గతం కన్నా అభివృద్ధికర మైన రీతిలో అనుభవంతో పనులు చేజారకుండా... పరిస్థి తులు విషమించకుండా ఆకట్టు కుంటూ వస్తారు. కొన్ని కొన్ని సందర్భాలలో మిత్రపక్షంవారైన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించక తప్పనిసరి పరిస్థి తులు ఏర్పడతాయి. ఉద్యమం నిర్వహించాలా అన్న విషయంలో కూడా ఊగిసలాట సాగుతుంది. మొత్తానికి చాకచక్యంతో ప్రజలకు మేలు చేయాలనే తపనను వ్యక్తీకరిస్తూ విజయం సాధించగలుగుతారు.

కెసిఆర్‌:
ఈ సంవత్సరం వీరు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తికావు. అది కొంత బాధైనా కొన్ని వాగ్దానాలను నెరవేర్చినందుకు ప్రజాభిమానం బాగుంటుంది. చేపట్టే కార్యక్రమాల ద్వారా ఆర్థికాభివృద్ధిని అనుకున్నదానిలో సగంవరకైనా సాధించగలరు. మిత్ర, బంధు వర్గీయులు సహకరిస్తారు. అటు ఆంధ్ర ప్రభుత్వంతోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ మధ్య మధ్య ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఎదురైనా సర్ధుకుని వ్యవహారాలను సక్రమంగా నడిపించగలరు. సామాన్య గ్రహదోషాలను, ఆధ్యాత్మిక బలంతో ఎదుర్కొంటూ దోషాలను అధిగమించడం ద్వారా విజయాలను సాధిస్తారు.

జగన్‌:
ప్రజలకు సంబంధించిన అంశాలలో ఉద్యమాలు నిర్వహించాలని ప్రయత్నం చేసినా తగిన స్పందన లభించనందున కొంత నిరాశకు గురి అవుతారు. పార్టీ శ్రేణులను ఆకట్టుకొనుటకు చేయు పనులు పూర్తి స్థాయిలో అనుకూలతను సాధించలేవు. ముఖ్యమైన కార్యక్రమాలను నెరవేర్చుకోవడంలో ఎక్కువ శ్రమకు గురికావాల్సి వస్తుంది. న్యాయసంబంధమైన సమస్యలను ఎదుర్కొనే విషయంలో కొత్త సమస్యలు కనిపించే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారరంగంలో తగిన అభివృద్ధి కనిపించక మూలధనానికి ఖర్చుపెట్టి సమస్యలను దాటే ప్రయత్నం చేయాల్సి వస్తుంది.

- అభినవచారి
(సోర్స్- సూర్య వెబ్ పోర్టల్)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : panchangam  politician  modi  chandrababu  sonia gandhi  jagan  

Other Articles