Ap cm chandrababu naidu celebrate ugadi festival at capital city vill

chandrababu, ap, cm, panchangam, ugadi, anathavaram

ap cm chandrababu naidu celebrate ugadi festival at capital city village. chandrababu said that ap facing several problems but we will win the all problems.

హైదరాబాద్ లా రెండు, మూడు నగరాలు

Posted: 03/21/2015 01:20 PM IST
Ap cm chandrababu naidu celebrate ugadi festival at capital city vill

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతమైన అనంతవరంలో ఉగాది వేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్‌ కృష్షారావు మాట్లాడుతూ ఆంధ్రుల చారిత్రక వారసత్వంతో ముడిపడి ఉన్న ఈ నాలుగు పట్టణాల్లో రాజధాని నిర్మాణం చేపట్టడం హర్షణీయమన్నారు. అందరికీ ఆరోగ్యం బాగుంటుందని, అన్ని వృత్తుల వారికి బాగుంటుందని, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని పంచాంగకర్త వెంకట కృష్ణ పూర్ణప్రసాద్‌ చెప్పారు. రాబోయే విపత్తులను సమర్ధంగా ఎదుర్కొంటారని, ధాన్యం సమృద్ధిగా పండుతుందని ఆయన పేర్కొన్నారు. అత్యుత్తమ రాజధానిగా తుళ్లూరు నిలుస్తుందని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆయన వెల్లడించారు. యాంత్రీక వ్యాపార అభివృద్ధి, వైద్యవిద్యాపరంగా అభివృద్ధి సాధిస్తుందని ఆయన తెలిపారు. రైతుల త్యాగానికి ప్రతిఫలం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

ఒక పక్క కృష్ణానదీ తీరంలో బ్రహ్మాండమైన రాజధాని నిర్మించుకుంటున్నామని, ఇక్కడి వాతావరణం చూస్తే తనకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడారు. తుళ్లూరు ప్రాంత రైతాంగాన్ని తాను జీవితంలోనే ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, జపాన్‌, సింగపూర్‌, జర్మనీ దేశాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరముందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసి ఉండాలన్నారు. హైదరాబాద్‌ లాగా మన రాష్ట్రంలో రెండు, మూడు నగరాలను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రాన్ని తిరుగులేని శక్తిగా నిలుపుతామన్నారు. అన్ని వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయని, వాటితో అభివృద్ధి సాధిద్దామన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  ap  cm  panchangam  ugadi  anathavaram  

Other Articles