Telanagana cm kcr wish the all the best on this new year of ugadi

kcr, ugadi, ravindrabharathi, new year, power, cutts,

telanagana cm kcr wish the all the best on this new year of ugadi. the telnagana cm kcr celebrated the fastival at ravindrabharathi, hyderabad. he said that this new year nay get new life. in the future telanagana will not getting power cutts.

కొత్త ఏడాది అంతా మంచే జరుగుతుంది: కేసీఆర్

Posted: 03/21/2015 03:47 PM IST
Telanagana cm kcr wish the all the best on this new year of ugadi

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన్మథనామ సంవత్సరం 29వది... కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర 29వది అని సీఎం గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాం. వనరులు సద్వినియోగం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందన్నారు. పేదలు కడుపునిండా తిన్నప్పుడే నిజమైన పండగ. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అగ్రతాంబూలం వేస్తుందని తెలిపారు. వ్యవసాయరంగానికి మరింత ప్రోత్సాహం అందిస్తాం. ఏ రకమైన పంటలైనా రాష్ట్రంలో పండుతాయి. విత్తనోత్పత్తి భాండాగారంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని, విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తామని కెసిఆర్ తెలిపారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చి దిద్దుతామని చెప్పారు. పాలమూరు-నక్కలగండి ఎత్తిపోతలకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతకు విఘాతం లేకుండా చేస్తాం. బాసర నుంచి భద్రాచలం వరకు పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలను నిర్వహిస్తాం. తెలంగాణను విత్తన భాండాగారంగా రూపొందిస్తానన్నారు. పేదల కడుపు నిండినప్పుడే నిజమైన పండుగ అని కేసీఆర్‌ అన్నారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని తెలిపారు. వారం రోజుల్లో పాలమూరు, నక్కల గండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తానని కేసీఆర్‌ ప్రకటించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  ugadi  ravindrabharathi  new year  power  cutts  

Other Articles