Ugadi panchaga getting political colours

uagadi, panchangam, fastival, party, political, leaders

ugadi panchaga getting political colours. on ugadi festival every party getting new panchangam at their party offices.

పంచాంగమా..పార్టీ మోనిఫెస్టోనా.?

Posted: 03/21/2015 11:19 AM IST
Ugadi panchaga getting political colours

ఉగాది పండగ అనగానే గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఉగాది పచ్చడి అందరికీ కామన్ కానీ పంచాంగ శ్రవణం మాత్రం అందరికి ఒకేలా ఉండదు. అదేంటి పంచాంగం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందా అనుకుంటున్నారా.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లాగా.. పంచాంగ శ్రవణాలూ పార్టీలను బట్టి మారిపోతాయ్.  తెలుగునాట ఉగాదినాడు పార్టీలు తమ కార్యాలయాల్లో ప్రముఖ పంచాంగ కర్తలతో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం మామూలైపోయింది మరి గత పంచాంగ శ్రవణం గురించి అందరికీ తెలుసు కానీ , ఈ కొత్త పంచాంగం ఎవరికి ఎలా ఉంటుందో అని ఎంతో ఉక్తంటత నెలకొంది.

జయ నామ సంవత్సరంలో ‘సమన్యాయ పాలన’ వస్తుందని పొన్నలూరి శ్రీనివాస గార్గేయ టీడీపీ కార్యాలయంలో చేసిన పంచాంగ శ్రవణంలో చెప్పారు. జలసంబంధ ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయని.. పాలకులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జయ నామ సంవత్సరంలో గ్రహగతులు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేసిన సిద్ధాంతి మారేపల్లి రామచంద్ర శాస్ర్తి తెలిపారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే అయినా.. కొత్త రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందనే ధీమా టీపీసీసీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌ పంచాంగ శ్రవణంలో కనిపించలేదు. జయనామ సంవత్సరంలో కేంద్రంలోనూ తెలంగాణలోనూ బీజేపీకి మహర్దశ అని పంచాంగకర్త సంతోష్‌కుమార్‌ శర్మ అన్నారు. ఇందులో సగమే నిజమైంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిందిగానీ.. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఆయన చెప్పినట్టు లేదు.

గత సంవత్సరం ఉగాది రోజు చెప్పిన పంచాగ శ్రవణాల్లో ఒక్కొక్క పార్టికి అనుకూలంగా పంచాగాలు భవిష్యత్తును చెప్పాయి. అయితే గత ఉగాది నాడు చెప్పిన పంచాగ శ్రవణంలోని కొన్ని విషయాలు మాట పొల్లుపోకుండా నిజం కాగా, కొన్ని మాత్రం అస్సలు కాలేదు. మరి ఈ ఉగాది నాడు ఏ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ నాయకుడికి రాజయోగం పడుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uagadi  panchangam  fastival  party  political  leaders  

Other Articles