New zealand vs west indies nz score 393 guptill stays not out at 237

newzeland, westindies, Martin Guptill, cricket-world cup-2015,

Martin Guptill entered history books as he become the first Kiwi to score a double ton in ODIs with a 237-run knock. The opener's unbeaten innings powered the home side to 393. He notched up 24 fours and 11 sixes and flayed the Windies attack to all parts of the ground.

విజృంభించిన మార్టిన్ గుప్టిల్.. న్యుజిలాండ్ 393/6

Posted: 03/21/2015 10:52 AM IST
New zealand vs west indies nz score 393 guptill stays not out at 237

విల్లింగ్ టన్ లో జరుగుతున్న న్యుజిలాండ్, వెస్టిండీస్ మ్యాచ్ లో న్యుజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. న్యజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ అజేయ డబుల్ సెంచరీతో సునామీ ఇన్నింగ్స్ ఆడడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. విండీస్ కు 394 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గుప్టిల్ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విండీస్ బౌలర్లను ఎడాపెడా బాదుతూ కెరీర్ లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.మెక్ కల్లమ్ 12, స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా గుప్టిల్ అనూహ్యంగా చెలరేగడంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. గుప్టిల్ 163 బంతుల్లో 24 ఫోర్లు, 11 సిక్సర్లతో 237 పరుగులు చేశాడు. రోంచీ 9, ఇలియట్ 27, ఆండర్సన్ 15, రాస్ టేలర్ 41, విలియమ్సన్ 33, మెక్ కల్లమ్ 12 పరుగులు చేసి అవుటయ్యారు. విండీస్ బౌలర్లలో టేలర్ 3, రసెల్ 2, వికెట్లు పడగొట్టారు.

వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్  ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్ లో మార్టిన్ గుప్టిల్ డబుల్ సెంచరీ చేయడమే కాకుండా అత్యధిక పరుగుల రికార్డును సృష్టించాడు. ఇదే వరల్డ్ కప్ లో క్రిస్ గేల్- 215 నమోదు చేసిన రికార్డును మార్టిన్ గుప్టిల్అధిగమించాడు. అంతకుముందు 152  బంతుల్లో 21  ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ మార్కును దాటిన మార్టిన్ గుప్టిల్ ఆ తరువాత గేల్ రికార్డును కూడా అధిగమించాడు. మార్టిన్ గుప్టిల్ (237 నాటౌట్; 163 బంతుల్లో 24 ఫోర్లు, 11 సిక్సర్లు) వీర విహారం చేసి విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ప్రపంచకప్ లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందగా, వన్డేల్లో న్యూజిలాండ్ తరుపున డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్ మెన్.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : newzeland  westindies  Martin Guptill  cricket-world cup-2015  

Other Articles