Congress senior leader renuka chowdary facing alligations

renuka chowdary, contraversy, chowdary, khamma, police, case, fir

congress senior leader renuka chowdary facing alligations. police file fir on congress senior leader renuka chowdary for cheating a person who loose large amount.

రేణుక చౌదరీ.. ఏంటా పాడు పని..!

Posted: 03/21/2015 11:55 AM IST
Congress senior leader renuka chowdary facing alligations

కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తానని నమ్మించి 1.10 కోటి రూపాయల మోసం చేసినట్టు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. . రేణుకా చౌదరిపై రాంజీ అనే స్థానిక నేత భార్య భూక్యా కళావతి అనే ఆమె కేసు పెట్టగా, ఖమ్మం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. గత ఎన్నికలలో తన భర్త రాంజీకి ఖమ్మం జిల్లాలో వైరా అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది.  రేణుకా చౌదరి తన భర్త వద్ద నుండి రూ.1.10 కోట్లు పుచ్చుకొన్నారని ఆమె ఆరోపించారు. రేణుకా చౌదరి తన భర్తకు ఆమె టికెట్ ఇప్పించకపోవడంతో ఆయన తీవ్ర మానసికవేదన అనుభవించి చనిపోయారని తెలిపారు.
 
చివరకు భూక్యా కళావతి హైకోర్టులో పిటిషను వేశారు. దానిపై స్పందించిన హైకోర్టు తక్షణమే రేణుకా చౌదరిపై కేసు నమోదు చేసి విచారించమని పోలీసులను ఆదేశించడంతో వారు రేణుకా చౌదరిపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఆ తరువాత ఆమెను తమ డబ్బు వాపసు చేయమని ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకపోగా, ఆమె తనను కులం పేరుతో దూషించారని, తాను ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు పిర్యాదు చేసినా వారూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన రేణుకా చౌదరి తనెన్నడూ ఆమెను కానీ, ఆమె భర్తని గానీ కనీసం చూడలేదని రేణుక చౌదరి తెలిపారు. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే పోలీసులు విచారణను పారదర్శకంగా చెయ్యాలి. మరి అది జరుగుతుందో లే్క అవినీతికి పోలీసులు లొంగుతారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : renuka chowdary  contraversy  chowdary  khamma  police  case  fir  

Other Articles